AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరితో ఇలా లడ్డులూ చేస్తే ఉంటాది.. అబ్బబ్బా .. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Pachhi kobbari laddu recipe in telugu: కొబ్బరి లడ్డులంటే చాలా మందికి ఇష్టం. బెల్లంతో చేస్తే ఇంకా స్వీట్ గా ఉంటాయి. అయితే, వీటిని సరైన కొలతలతో చేసి తింటే అరుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ వీటిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 30, 2026 | 3:27 PM

Share
కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, పావు కిలో బెల్లం లేదా పంచదార,  మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 
పావు టీ స్పూన్ యాలకుల పొడి , బాదం పప్పులు,  కిస్మిస్ లను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, పావు కిలో బెల్లం లేదా పంచదార, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, పావు టీ స్పూన్ యాలకుల పొడి , బాదం పప్పులు, కిస్మిస్ లను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పచ్చి కొబ్బరి, బెల్లం రెడీ చేసుకోవాలి: ఒక గిన్నె తీసుకుని పచ్చి కొబ్బరిని బాగా తురుము కోవాలి. ఇంకా దీనిలో బెల్లం తురుమును కూడా వేసుకుని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు కుకింగ్ మొదలు పెట్టాలి: పాన్‌లో 1 టీ స్పూన్ స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి బెల్లం మిశ్రమం కూడా దానిలో వేసి మీడియం మంట పై  10 నిమిషాలు వాటిని కలుపుతూ బాగా ఉడికించాలి.

3 / 5
యాలకుల పొడి, కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. పాన్ ను కిందకి దించి ఆ మిశ్రమాన్ని చల్లార్చి అలా ఫ్యాన్ కింద ఒక 30 నిముషాల పాటు అలాగే ఉంచాలి.

4 / 5
లడ్డూలుగా చేసుకోవాలి: ఇక ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే, కిస్మిస్ లు కూడా దీనిలో వేసుకోవాలి. లడ్డూలను ఒక ప్లేట్‌లో ఉంచి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. ఇలా చేస్తే ఈజీగా 7–10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.

5 / 5
Follow Us