AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: పుచ్చకాయ కొంటున్నారా..? ఇలా చెక్‌ చేసి తీసుకోండి.. లేదంటే మీరే లాస్‌ అవుతారు!

పుచ్చకాయ వేసవి కాలపు ప్రత్యేక ఆకర్షణ. ఎండలు ముదురుతున్న కొద్దీ మార్కెట్లో పుచ్చకాయల సందడి పెరుగుతుంది. ఎర్రగా, రసభరితంగా ఉన్న పుచ్చకాయను చూడగానే దాన్ని తినాలనిపిస్తుంది. అందుకే ఎంతో ఉత్సాహంగా కొని ఇంటికి తెచ్చుకుంటాం. కానీ, మనం కొన్న పుచ్చకాయ కట్ చేసిన తర్వాత తెల్లగానో లేదా చప్పగానో ఉంటే చాలా నిరాశ చెందుతాము. కానీ, కొన్ని సులభమైన చిట్కాలతో మీరు తీయని పుచ్చకాయను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Mar 30, 2026 | 3:10 PM

Share
పసుపు రంగు మచ్చ (The Yellow Spot): పుచ్చకాయను తిప్పి చూసినప్పుడు ఒక వైపు మచ్చ కనిపిస్తుంది. దీనిని ఫీల్డ్ స్పాట్ అంటారు. ఈ మచ్చ ముదురు పసుపు లేదా క్రీమ్ రంగులో ఉంటే, ఆ కాయ తీగపైనే బాగా పండిందని అర్థం. ఒకవేళ ఆ మచ్చ తెల్లగా ఉంటే, అది ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే కోసేశారని అర్థం. అలాంటి కాయలు తీయగా ఉండవు.

1 / 5
 బరువును గమనించండి:  పుచ్చకాయను చేత్తో పైకి ఎత్తి చూడండి. అది దాని పరిమాణం కంటే ఎక్కువ బరువుగా అనిపించాలి. ఎక్కువ బరువు ఉందంటే అందులో నీటి శాతం ఎక్కువగా ఉందని, అది తాజాగా ఉందని అర్థం.

2 / 5
పండులోంచి వచ్చే శబ్ధాన్ని గమనించడండి: మీ వేళ్లతో పుచ్చకాయను తట్టి చూడండి. ఒకవేళ నిండుగా (Dull thud) కాకుండా, లోపల ఖాళీగా ఉన్నట్లు ప్రతిధ్వనించే శబ్దం వస్తే అది బాగా పండినట్లు గుర్తు. మొద్దుబారిన శబ్దం వస్తే అది పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

3 / 5
 ఆకారం, చారలు: పుచ్చకాయ ఆకారం సమానంగా ఉండాలి. వంకరటింకరగా ఉంటే దానికి సరైన ఎండ, నీరు అందలేదని అర్థం. అలాగే కాయపై ఉండే చారలు ముదురు ఆకుపచ్చ రంగులో స్పష్టంగా ఉండాలి. పండుపై ఉన్న గోధుమ రంగు వెబ్బింగ్ (Webbing) గుర్తులు అది చాలా తీయగా ఉంటుందని సూచిస్తాయి.

4 / 5
తొడిమను చూడండి: పుచ్చకాయ తొడిమ ఎండిపోయి ఉంటే అది పండినట్లు. ఒకవేళ తొడిమ ఆకుపచ్చగా, తాజాగా ఉంటే అది ఇంకా పక్వానికి రాలేదని అర్థం. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను ఉపయోగించి సరైన పండును ఎంచుకోండి!

5 / 5
Follow Us
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..

వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!

ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?

ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.

జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..

సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..

ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?

తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..