AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు పక్క తడుపుతున్నారా? ఈ సహజ చిట్కాలతో సమస్యను ఈజీగా పరిష్కరించండి!

పిల్లలు నిద్రలో తెలియకుండానే పక్క తడపడం అనేది చాలా మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే సమస్య. ఇది సాధారణంగా ఐదు ఏళ్ల లోపు పిల్లల్లో సహజం, కానీ, ఆపై వయసు వారిలో కూడా కనిపిస్తే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం మేలు. ఈ సమస్యకు ప్రధాన కారణం నాడీ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం లేదా గాఢ నిద్ర కావచ్చు. మీ పిల్లలు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పెడుతున్నారా..? అయితే, ఈ సమాచారం మీ కోసమే..

పిల్లలు పక్క తడుపుతున్నారా? ఈ సహజ చిట్కాలతో సమస్యను ఈజీగా పరిష్కరించండి!
Bedwetting In Children
Jyothi Gadda
|

Updated on: Mar 30, 2026 | 3:24 PM

Share

పిల్లలు రాత్రిపూట పక్క తడపడం (Enuresis) అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. అది వారి శారీరక ఎదుగుదలలో ఒక భాగం. అయితే, పెద్దయ్యాక కూడా ఈ సమస్య కొనసాగితే పిల్లలు ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను ఇంట్లోని వస్తువులతోనే ఎలా అదుపు చేయాలో చూద్దాం.

దాల్చిన చెక్క అద్భుత గుణాలు:

దాల్చిన చెక్క శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. పిల్లలు రోజూ దాల్చిన చెక్క ముక్కను నమలడం లేదా దాని పొడిని ఆహారంలో కలిపి ఇవ్వడం వల్ల మూత్రాశయ కండరాలు బలోపేతం అవుతాయి. ఇది రాత్రిపూట మూత్ర విసర్జనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

తేనెతో తీపి పరిష్కారం:

తేనెకు తేమను పీల్చుకునే గుణం ఉంది. నిద్రపోయే ముందు ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె ఇవ్వడం వల్ల అది శరీరంలోని అదనపు ద్రవాలను నియంత్రిస్తుంది. ఇది పిల్లల్లో మూత్రాశయం నిండకుండా చూడటమే కాకుండా వారికి మంచి నిద్రను కూడా ఇస్తుంది.

ఆలివ్ ఆయిల్ మసాజ్:

రాత్రి పడుకోవడానికి ముందు గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో పిల్లల పొత్తికడుపు (Lower Abdomen) భాగంలో మృదువుగా మసాజ్ చేయాలి. దీనివల్ల మూత్రాశయ నియంత్రణ సామర్థ్యం పెరుగుతుంది. క్రమంగా పక్క తడిపే అలవాటు తగ్గుతుంది.

క్రమశిక్షణతో కూడిన అలవాట్లు కూడా పిల్లల్ని ఈ సమస్య నుండి దూరం చేస్తాయి. ఇందుకోసం ఈ క్రింది నియమాలను తప్పక పాటించాలి.

ద్రవ పదార్థాల నియంత్రణ: సాయంత్రం 6 గంటల తర్వాత పిల్లలకు ఎక్కువ నీరు లేదా జ్యూస్‌లు ఇవ్వడం తగ్గించాలి.

టాయిలెట్ షెడ్యూల్: పడుకునే ముందు ఖచ్చితంగా వాష్‌రూమ్‌కు వెళ్లేలా చూడాలి. అవసరమైతే రాత్రి మధ్యలో ఒకసారి లేపి పంపడం అలవాటు చేయాలి.

కెఫీన్ వద్దు: రాత్రి వేళల్లో చాక్లెట్లు, కోకో కోలా వంటి కెఫీన్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి మూత్రపిండాల పనితీరును వేగవంతం చేస్తాయి.

కానీ, పిల్లలు పక్క తడిపినప్పుడు వారిని తిట్టడం లేదా శిక్షించడం చేయకూడదు. ఇది వారిలో ఒత్తిడిని పెంచి సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఓపికతో, ప్రేమతో ఈ సహజ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us