AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాటూల పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలాగే ఉంటుంది… నాలుకను కూడా నల్లగా మార్చుకున్న మహిళ! కట్‌చేస్తే…

సాధారణంగా స్టైల్ కోసం ఒకటో రెండో టాటూలు వేయించుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ కథ వేరు. టాటూలే తన ప్రపంచం అనుకున్న ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తన శరీరంపై దాదాపు 90 శాతం భాగాన్ని టాటూలతో నింపేసిన ఆమె, తాజాగా తన నాలుకకు కూడా నల్లటి రంగు టాటూ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని కోసం ఆమె కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా, ఎంతో శారీరక నొప్పిని కూడా భరించింది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

టాటూల పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలాగే ఉంటుంది... నాలుకను కూడా నల్లగా మార్చుకున్న మహిళ! కట్‌చేస్తే...
Tattoos
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2026 | 8:58 PM

Share

ప్రపంచంలో వింత వ్యక్తులకు, వారి వింత అలవాట్లకు కొదవలేదు. జర్మనీకి చెందిన లిన్నెయా (Linnea) అనే మహిళ టాటూల పట్ల తనకున్న పిచ్చిని తారస్థాయికి తీసుకెళ్లి వార్తల్లో నిలిచింది. జర్మనీకి చెందిన లిన్నెయా అనే మహిళకు టాటూలంటే ప్రాణం. కేవలం కొన్ని బొమ్మలతో సరిపెట్టుకోకుండా, తన శరీరాన్ని ఒక కాన్వాస్‌లా మార్చుకుంది. ఇప్పటికే శరీరం మొత్తం నల్లటి ఇంకుతో (Blackout Tattoos) నిండిపోయింది. దీని కోసం ఆమె ఇప్పటివరకు దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.

శరీరంపై ఖాళీ లేకపోవడంతో ఆమె తన దృష్టిని నాలుకపైకి మళ్లించింది. అత్యంత సున్నితమైన నాలుక భాగంలో నల్లటి రంగును ఇంజెక్ట్ చేయించుకుని, తన నాలుకను పూర్తిగా నల్లగా మార్చుకుంది. ఇది చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. నాలుకపై టాటూ వేయించుకోవడం అనేది చాలా నొప్పితో కూడుకున్న పని మాత్రమే కాదు, అది రుచిని కోల్పోయేలా చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అద్భుతమైన కళ అని కొందరు అంటుంటే, నిజమైన రూపాన్ని ఇలా పాడుచేసుకోవడం విచారకరం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే లిన్నెయా మాత్రం తనకు తన కొత్త రూపం చాలా ఇష్టమని, ఇతరుల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని చెబుతోంది.

టాటూలు వేయించుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇవి కూడా చదవండి

టాటూల పట్ల మక్కువ ఉన్నవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లైసెన్స్ ఉన్న, అనుభవం ఉన్న ఆర్టిస్ట్ దగ్గరే టాటూ వేయించుకోవాలి. వాడే నీడిల్స్ కొత్తవా కాదా అని సరిచూసుకోవాలి. టాటూ వేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే, ఇలాంటి ఫ్యాషన్ పేరుతో చేసే ఇలాంటి ప్రయోగాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. ముఖ్యంగా కళ్లలో, నాలుకపై టాటూలు వేయించుకోవడం వంటివి వైద్యపరంగా చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం