నేటి ఉరుకు పరుగుల జీవితం.. ఆధునిక జీవనశైలి.. యువత జీవితాల్లో మానసిక ఒత్తిడిని వేగంగా పెంచుతోంది. టీనేజర్లు, యువకులు ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో మానసిక ఒత్తిడి కనిపించడం ఆందోళనకరంగా మారింది. దీనికి ప్రధాన కారణం పాఠశాల, కళాశాలల ఒత్తిడి, సోషల్ మీడియా డిమాండ్, సమాజంలో తమ స్వంత గుర్తింపును సృష్టించడానికి మానసికంగా సంఘర్షణకు గురవుతూ.. పోరాడుతున్నారని వైద్య నిపుణలు చెబుతున్నారు.. తల్లిదండ్రులు ఈ సవాళ్లను అర్థం చేసుకోవడం.. వారి పిల్లలు ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి సహాయం చేయడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. పిల్లల్లో మానసిక ఒత్తిడి.. దాని నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన లేదా గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..