- Telugu News Photo Gallery Micro artist Venkatesh creates mother idol on a tip of pencil in Visakhapatnam
Mother’s Day Special: అమ్మకు ప్రేమతో.. ఈ యువకుడి టాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే..
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా..అంటూ తల్లి ప్రేమను అద్భుతంగా వర్ణించాడు ఓ సినీ కవి..! మనకు సృష్టిని పరిచయం చేసింది అమ్మ అయితే .. సృష్టి మనకు ఇచ్చిన గొప్ప కానుక అమ్మ. అటువంటి అమ్మకు ఏమిచ్చినా తక్కువే..! అందుకే అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు తల్లిపై ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా బిడ్డను లాలించే తల్లి ప్రేమ కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు.
Maqdood Husain Khaja | Edited By: Srikar T
Updated on: May 12, 2024 | 1:12 PM

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా..అంటూ తల్లి ప్రేమను అద్భుతంగా వర్ణించాడు ఓ సినీ కవి..! మనకు సృష్టిని పరిచయం చేసింది అమ్మ అయితే .. సృష్టి మనకు ఇచ్చిన గొప్ప కానుక అమ్మ.

అటువంటి అమ్మకు ఏమిచ్చినా తక్కువే..! అందుకే అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు తల్లిపై ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా బిడ్డను లాలించే తల్లి ప్రేమ కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు.

కేవలం పది మిల్లీమీటర్ల ఎత్తులో దీనిని రూపొందించడం రికార్డ్ అని చెప్పాలి. ఇతనిలోని ప్రతిభను, కళను చూసిన వారంతా శభాష్ అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్.. అమెరికాలో నివాసం ఉంటున్నాడు.

సందర్భానికి అనుసారం సూక్ష్మ కళాకారులు చేయడం అతనికి అలవాటు. పది మిల్లీ మీటర్ల ఎత్తు, 6మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ మైక్రో ఆర్ట్ తయారు చేశాడు వెంకటేష్. ఇంతటి గొప్ప రూపాన్ని తీసుకురావడానికి రెండు గంటల పాటు శ్రమించానని చెప్పాడు.

ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించి తల్లికి అంకితం చేస్తానని టీవీ 9తో అన్నారు. ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు వెంకటేష్. ఈ సారి మాతృదినోత్సవం సందర్భంగా తన మాతృ ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు.





























