Cholesterol: మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉందో.. లేదో.. పాదాలను చూసి చెప్పేయొచ్చు! ఎలాగో తెలుసా..

ఒంట్లో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ సైలెంట్‌గా పలు వ్యాధులను ఆహ్వానిస్తుంది. దీని లక్షణాలు చాలా మంది గుర్తుపట్టలేరు. అందువల్లనే సకాలంలో వైద్యం అందక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటూ ఉంటారు. అయితే..

Srilakshmi C

|

Updated on: Nov 10, 2024 | 1:48 PM

క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం చెడు కొలెస్ట్రాల్‌ వ్యాధికి ప్రధాన కారణాలు. నేటి తరంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అందుకే నేటి తనంలో గుండెపోటు వయసు 40 ఏళ్లకు తగ్గిందని వివిధ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

1 / 5
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే దీనికి కారణం. కానీ సమస్య ఏమిటంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నా, రక్తపరీక్ష చేసేంత వరకు మనకు తెలియదు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా మందికి తెలియదు. మీ పాదాల ద్వారా ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందో లేదో తెలుసుకోవచ్చు.

2 / 5
ఉదయం నిద్రలేచిన వెంటనే అసాధారణంగా ఉబ్బిన పాదాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండండి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాళ్ల వాపులు వస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే, పాదాల వాపుకు కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం.

3 / 5
కొన్నిసార్లు కాళ్ళలో నొప్పి అధికంగా ఉంటుంది. కాళ్లు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుంది. కాళ్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఫలితంగా కాళ్లకు సరైన రక్త ప్రసరణ జరగక ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అందుకే పాదాల నొప్పి మొదలవుతుంది. ఇది రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా జరగవచ్చు.

4 / 5
కాలి కండరాలు ఎప్పుడు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల అరికాళ్ల కింద మంటలు వస్తుంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే, కాళ్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో కాళ్లలో తిమ్మిర్లు, కాలి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే, రాత్రిపూట పాదాలు చల్లగా మారిపోతాయి. శీతాకాలం, వేసవి, వర్షాకాలం.. సీజన్‌ ఏదైనా అన్ని సీజన్లలో రాత్రిపూట పాదాలు చల్లగా మారిపోతుంటే వెంటనే వైద్యల వద్దకు వెళ్లాలి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సంకేతం.

5 / 5
Follow us