- Telugu News Photo Gallery Cinema photos Actress kavya kalyanram vacation photos goes viral on internet
Kavya Kalyanram: బలగం బ్యూటీ సైలెంట్ అయ్యిందే.. విదేశాల్లో విహరిస్తోన్న కావ్య కళ్యాణ్ రామ్
స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్ర బోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాల్లో కావ్య నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారింది.
Updated on: Nov 12, 2024 | 8:49 PM

కావ్య కళ్యాణ్ రామ్.. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.

స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్ర బోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాల్లో కావ్య నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

ఈముద్దుగుమ్మ 2022లో వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ కావ్య రోల్ కు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత బలగం సినిమా చేసింది.

బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. బలగం సినిమా తర్వాత ఉస్తాద్ అనే సినిమా చేసింది.కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.




