బియ్యం కడిగిన నీళ్లే కదా అని పారేస్తున్నారా.?
12 November 2024
Ravi Kiran
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నానికే పెద్ద పీట వేస్తారు.
అయితే అన్నం వండేముందు బియ్యాన్ని కడగటం సహజం. బియ్యం కడిగిన నీటిని సింపుల్ గా సింకులో పోసేయడం అందరూ చేసే పనే.
బియ్యం కడిగిన నీరు సహజంగా మబ్బుగా ఉంటుంది. అయితే ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయట.
ఈ నీటిని సింకులో పడేయకుండా వీటిని తిరిగి ఉపయోగించడం వల్ల వివిధ లాభాలు కూడా చేకూరతాయి.
బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.
షాంపూతో తల స్నానం చేసిన తరువాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి.
ఆ తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి.
జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు కూడా వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి