చింతాకు టీతో మీ చింతలన్నీ మటుమాయం
Phani CH
12 November 2024
మనం ఇప్పటి వరకు గ్రీన్ టీ, బ్లాక్ టీ, తులసి టీ, మసాలా టీ వంటి రకరకాల టీ లు చూసాం అయితే చింత ఆకు టీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ??
నిజానికి చింత ఆకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట..
చింత ఆకులతో టీ చేసి తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి.
చింతఆకులలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇవి గుండె సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.
మీరు బరువు అనుకున్నట్లు అయితే చింత ఆకుల టీను ఎంచుకోండి.. ఈ టీలో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉన్నాయి. ఇది జీవక్రియను పెంచుతుంది.
చింత ఆకుల టీ కూడా మీ రోగనిరోధక పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
అంతేకాకుండా చింత ఆకుల టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది వాపు, నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి