తృణధాన్యాలు అంటే హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, క్వినోవా, వోట్స్ వంటి వాటితో చేసిన స్నాక్స్ ను మద్యంతో పాటు తీసుకోవచ్చు.. ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కాబట్టి రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాకుండా అడ్డుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఆల్కహాల్ తాగిన తర్వాత మైకం, అలసట, మానసిక కల్లోలం వంటి వాటిని తట్టుకునే శక్తి ఈ తృణధాన్యాలు కలిగిస్తాయి. తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆల్కహాల్ శోషణను కూడా నెమ్మదించేలా చేస్తుంది.