Curd with sugar:పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..!
ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు, లేదా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, నోటిని తిపి చేస్తుంటారు చాలా మంది..అందుకోసం పెరుగు, చక్కెరను కలిపి తింటుంటారు. ఇలా చేయడం వల్ల ఆ పని శుభప్రదంగా పూర్తవుతుందని, ప్రయాణం సుఖవంతంగా సాగుతుందని నమ్మకం. పెరుగు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అందుకే పంచదార కలుపుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, కొన్నిసార్లు ఇలా చేయడం పర్వాలేదు, కానీ, మీరు ప్రతిరోజూ పెరుగు, పంచదార తింటే మాత్రం సైడ్‌ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..