విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాల్సిందే.. అన్ని పోషకాలూ మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.. అయితే.. మన ఆహారం శరీరం సరైన పనితీరుకు అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. మన శరీరానికి అవసరమైన ప్రధాన విటమిన్లలో విటమిన్ డి ఒకటి.. శరీరంలో విటమిన్ డి లోపిస్తే, అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. విటమిన్ డి సమృద్ధిగా ఉండే అటువంటి ఆహారాలను మీరు మీ ఆహారంలో చేర్చుకుంటే.. దీని లోపాన్ని అధిగమించవచ్చు.. కావున విటమిన్ డి లోపం ఏర్పడకుండా సమృద్ధిగా పొందేందుకు ఎలాంటి ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలో ఇప్పడుు తెలుసుకోండి..