- Telugu News Photo Gallery IMD weather update: Heavy Rains Forecast in Andhra Pradesh and Telangana Today in these districts
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Updated on: Sep 26, 2024 | 9:05 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణతోపాటు.. ఏపీలో వచ్చే రెండు రోజులు చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం, శుక్రవారం తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్సాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీలో కూడా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి,విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
