Aloe Vera Gel Benefits: మొటిమల సమస్యతో ఇబ్బందిపడుతున్నారా..? కలబందతో ఇలా చెక్‌ పెట్టొచ్చు..

కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. ముఖ్యంగా మహిళలు సౌందర్య పోషణలో కలబంద కీలకంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, పోషకాలు చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా కావాల్సిన పోషణను అందిస్తాయి. చర్మం జిడ్డుగా, సున్నితంగా, పొడిగా ఇలా అన్ని రకాల చర్మతత్వాల వారికీ కలబంద మేలు చేస్తుందని చెబుతున్నారు. కలబందతో చర్మానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Sep 26, 2024 | 8:02 AM

ముఖం మెరుస్తూ మంచి నిగారింపుతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. ఇంటివారికి ఇంట్లోని పదార్థాలతో కలబందను యాడ్‌ చేసుకుని మంచి ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. మెరిసే ముఖం కోసం చిటికెడు పసుపు, ఒక చెంచాడు పాలు, కొంచెం రోజ్‌వాటర్, ఒక చెంచా తేనె పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి.

1 / 5
ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతి వంతమవుతుందని సౌందర్య నిపుణలు సూచిస్తున్నారు.

2 / 5
చర్మం జిడ్డుగా ఉండేవారిలో మొటిమల సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అలాంటి వారు కలబంద ఆకుల్ని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి బాగా పట్టించాలి.  పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
ముఖంపై తరచూ వచ్చే మొటిమలతో అమ్మాయిలు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అయితే, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కలబందకు మించింది లేదంటారు సౌందర్య నిపుణులు. అలా మెటిమల సమస్య ఉన్నచోట కలబంద గుజ్జులో రెండు చుక్కల గులాబీనూనె కలిపి ముఖానికి రాయాలి. కాసేపు అలానే వదిలేయాలి. ఇది చర్మానికి మంచి పోషణ అందిస్తుంది.

4 / 5
ఎక్కువగా ఎండకు గురైనప్పుడు చర్మంపై ట్యాన్‌ ఏర్పడుతుంది. దీనికి పరిష్కారం కోసం కొంచెం కలబంద గుజ్జును తీసుకొని అందులో టీస్పూన్‌ చొప్పున పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రాంతంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ మాత్రమే కాదు, ముఖంపై వచ్చే మొటిమలు కూడా తగ్గిపోతాయంటున్నారు నిపుణలు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!