- Telugu News Photo Gallery How to easily remove ink stains from school dresses, check here is details in Telugu
Cleaning Tips: స్కూల్ డ్రెస్సులపై ఇంక్ మరకలా.. ఇలా ఈజీగా పోగొట్టేయండి!
చిన్న పిల్లలు ఎక్కువగా ఆడుతూ.. తిరుగుతూ ఉంటారు. దీని వల్ల వారి బట్టలు త్వరగా మురికి అవుతాయి. అందులోనూ స్కూల్‌కి వెళ్లే పిల్లల గురించి చెప్పాల్సిన పని లేదు. స్కూల్‌కి వెళ్లినప్పుడు స్కూల్ డ్రెస్‌కి చాలా మరకలను అంటించుకుంటారు. అందులోనూ ఇంక్ లాంటి మెండి మరకలు అయితే అంత త్వరగా పోవు. స్కూల్ డ్రెస్సులపై ఏలాంటి మరక పడినా చిరాకుగా కనిపిస్తుంది. ఇలాంటి మరకలు పోవాలంటే చాలా శ్రమించాల్సి..
Updated on: Feb 13, 2024 | 2:06 PM

చిన్న పిల్లలు ఎక్కువగా ఆడుతూ.. తిరుగుతూ ఉంటారు. దీని వల్ల వారి బట్టలు త్వరగా మురికి అవుతాయి. అందులోనూ స్కూల్‌కి వెళ్లే పిల్లల గురించి చెప్పాల్సిన పని లేదు. స్కూల్‌కి వెళ్లినప్పుడు స్కూల్ డ్రెస్‌కి చాలా మరకలను అంటించుకుంటారు. అందులోనూ ఇంక్ లాంటి మెండి మరకలు అయితే అంత త్వరగా పోవు.

స్కూల్ డ్రెస్సులపై ఏలాంటి మరక పడినా చిరాకుగా కనిపిస్తుంది. ఇలాంటి మరకలు పోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఇంక్ మరకలు పడ్డ బట్టలను గోరు వెచ్చటి నీటిలో ఎక్కువ సేపు నానబెట్టండి. ఆ తర్వాత ఉతికితే త్వరగా పోతుంది.

అలాగే టూత్ పేస్ట్ ఉపయోగించి కూడా మరకలను త్వరగా వదలగొట్టవచ్చు. ఇంక్ మరకలు పడ్డ చోట టూత్ పేస్ట్ రాసి కాసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత టూత్ బ్రష్ తో రుద్దితే.. త్వరగా పోతాయి.

అలాగే టూత్ పేస్ట్ ఉపయోగించి కూడా మరకలను త్వరగా వదలగొట్టవచ్చు. ఇంక్ మరకలు పడ్డ చోట టూత్ పేస్ట్ రాసి కాసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత టూత్ బ్రష్ తో రుద్దితే.. త్వరగా పోతాయి.

అదే విధంగా మరకలను డెటాల్‌తో కూడా వదిలించుకోవచ్చు. మరక పడ్డ ప్రదేశంలో డెటాల్ వేసి స్క్రబ్ చేసి.. కాసేపు పక్కన పెట్టండి. నెక్ట్స్ బ్రష్ పెట్టి రుద్దితే పోతుంది. అలాగే మరక పడిన ప్రదేశంలో ఎండ బాగా తగిలేలా ఆరేయాలి. అప్పుడు త్వరగా మరకలు పోతాయి.




