- Telugu News Photo Gallery Throwing away the kitchen wastage there are many benefits with them, check details in Telugu
Kitchen Hacks: కిచెన్ వేస్టేజ్‌ని వేస్ట్ చేయకండి.. చాలా లాభాలు ఉన్నాయండోయ్!
కిచెన్‌లో చాలా వేస్టేజ్ ఉంటుంది. చాలా మంది ఈ వ్యర్థాలను బయట పడేస్తూ ఉంటారు. కిచెన్ వేస్టేజ్‌ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారా. ఆ సింపుల్ చిట్కాలు మీకోసమే చూసేయండి. కూరగాయలకు, పండ్లకు చెక్కు తీస్తూ ఉంటారు. వీటిల్లో బీరకాయలు కూడా ఉంటాయి. కొంత మందికి ఓపిక ఏంటే ఆ బీర..
Updated on: Feb 13, 2024 | 1:45 PM

కిచెన్‌లో చాలా వేస్టేజ్ ఉంటుంది. చాలా మంది ఈ వ్యర్థాలను బయట పడేస్తూ ఉంటారు. కిచెన్ వేస్టేజ్‌ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారా. ఆ సింపుల్ చిట్కాలు మీకోసమే చూసేయండి.

కూరగాయలకు, పండ్లకు చెక్కు తీస్తూ ఉంటారు. వీటిల్లో బీరకాయలు కూడా ఉంటాయి. కొంత మందికి ఓపిక ఏంటే ఆ బీర తొక్కల్ని కూడా పచ్చడి చేస్తారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే బీర తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ వీటిని పడేయకుండా సూప్ చేసుకోండి.

అంతే కాకుండా కొన్ని రకాల పండ్ల తొక్కలతో చట్నీ లేదా జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు వంటలు కూడా ఉన్నాయి. నారింజ, నిమ్మ కాయ వేస్టేజ్ వంటి వాటితో కొవ్వొత్తులను కూడా తయారు చేయవచ్చు.

అలాగే కట్ చేసిన కూర గాయలు, ఉల్లిపాయ తొక్కలు, కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన కోడి గుడ్లు వీటిని అస్సలు పడేయకండి. ఎందుకంటే వీటిని మీ ఇంట్లోని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అవి కూడా చక్కగా ఎదుగుతాయి.

అలాగే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కల్ని పడేయకుండా పశువులకు మేతలా కూడా పెట్టొచ్చు. అంతే కాదండోయ్ వేస్టేజ్‌లో నిమ్మ, నారింజ తొక్కలు ఉంటే వాటితో గిన్నెలు కూడా శుభ్రం పరచుకోవచ్చు.




