Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటే.. ఆ సమస్యలన్ని మటుమాయం.. అవేంటో తెలుసుకోండి..

Healthy Breakfast: జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి.. ఉదయం వేళ అల్పాహారంలో పలు రకాల ఆహారాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారాలు గ్యాస్, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ డైట్‌లో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2022 | 8:38 PM

అనారోగ్యకరమైన ఆహారం, దుర్భర జీవనశైలి కారణంగా చాలాసార్లు జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు అల్పాహారం సమయంలో అనేక ఆహారాలను తీసుకోవచ్చు. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

1 / 5
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఉదయాన్నే బొప్పాయిని తినడం చాలామంచిది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

2 / 5
యాపిల్: యాపిల్ చాలా రుచికరమైన పండు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. పొటాషియం, మినరల్స్, విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3 / 5
అరటిపండు: అరటిపండును అనేక విధాలుగా తీసుకోవచ్చు. మీరు దీన్ని జ్యూస్, సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.

4 / 5
పోహ: ఉల్లిపాయ, వేరుశనగలు, ఆవాలు, దానిమ్మ, ఉప్పు, కరివేపాకులను ఉపయోగించి పోహను తయారు చేస్తారు. ఇది తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది కూడా బాగా పనిచేస్తుంది.

5 / 5
Follow us