Fast Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఇలా చేయండి..
fastest way to lose weight for woman: వేగంగా బరువు తగ్గాలనుకునే వారు ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం అవసరం. ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం మానకూడదు. అలాగే పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు అన్నీ తినాలి.
Updated on: Jun 15, 2022 | 2:04 PM


శరీరంలో కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది? అనే విషయాన్ని చాలా మంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి శరీరంలో అవాంఛిత కొవ్వు పేరుకుపోవడం వెనుక మాత్రం మన రోజువారీ జీవన విధనం దాగి ఉందనే విషయం మరచిపోకూడదు. మీరు పిల్లల తల్లి అయితే, టైంకి తినకపోతే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. బరువు పెరగడం ప్రారంభమైతే తొలుత కొవ్వు మొదట పొత్తికడుపులో పేరుకుపోవడం మొదలవుతుంది.

హడావిడి జీవన విధానంలో సరిగ్గా తినక, ఆకలికి తాళలేక చేతికి ఎదురుగా ఏది దొరికితే అది తినడం వల్ల బరువు పెరుగటం జరుగుతుంది. అందుకే సమయానికి భోజనం చెయ్యాలి.

గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. వేడిగా ఉండగానే తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. అదనపు కొవ్వు కూడా దరిచేరదు.

ఈ డ్రింక్‌ను ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌కి ముందు తాగితే కొవ్వు తగ్గడమే కాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.





























