- Telugu News Photo Gallery Health Tips: Rice Eating Advantages And Disadvantages To Health, Know Details Here In Telugu
Health Tips: రోజుకు మూడు సార్లు అన్నం తింటున్నారా.. షుగర్ పేషేంట్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే..
భారతీయుల ప్రధాన ఆహారం వరి గోధుమ. ముఖ్యంగా దక్షిణ భారతీయుల ప్రధాన ఆహారం. బియ్యంతో అనేక రకాల వంటలను తయారు చేస్తారు. బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తక్షణ శక్తిని ఇస్తాయి. దక్షిణ భారతీయులు అన్నం తినకుండా ఒక్కరోజు కూడా ఉండరు. కొందరు అన్నాన్ని రోజులో మూడు సార్లు ఆహారంగా తీసుకుంటారు. అయితే అన్నం ఎక్కువగా తినడం చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి తగినంత పీచు అందకపోతే మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు.
Updated on: Nov 14, 2023 | 1:02 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అన్నాన్ని ఏదొక రూపంలో ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే అన్నం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. మనం తినే ఆహారంలో తగినంత పీచుపదార్థం ఉండాలి. లేదంటే మలబద్ధకం వంటి అనేక సమస్యలు వస్తాయి. అందుకని మూడు పూటలా అన్నం తీసుకోవడం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి తగినంత ఫైబర్ అందకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. పప్పులు, కూరగాయలు, గోధుమలు, శనగలు, మినుములు వంటి వాటిని భోజనంలో చేర్చుకోవాలి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వైట్ రైస్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లటి అన్నం తక్కువగా తినమని సూచిస్తున్నారు.

వైట్ రైస్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక కేలరీల తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక వైద్యుల సలహా మేరకు అన్నం తీసుకోవడం మంచిది.

ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ పోషకాల లోపం ఎముకలు, దంతాలతో సహా అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. పోషకాహార లోపం అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. రోజూ ఎక్కువగా అన్నం తింటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

తెల్ల బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు అన్నం తినకుండా.. ఇతర ఆహార ధాన్యాలను తినే ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.





























