- Telugu News Photo Gallery Goosebumps Reasons in Telugu What are possible causes of goosebumps caused by emotion why How do goosebumps develop
Goosebumps Reasons: శరీరంపై వెంట్రుకలు ఎందుకు నిక్కబొడుస్తాయో తెలుసా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి
Goosebumps Reasons: మీరు నేహా కక్కర్ చిత్రాన్ని చూడండి! ఆమె ఇండియన్ ఐడల్ షోకు న్యాయనిర్ణేతగా ఉన్నప్పుడు.. ఒక కంటెస్టెంట్ ఆమె ఆలపించిన పాటను పాడాడు. ఈ సమయంలో ఆమె చేతిపైనున్న వెంట్రుకలు నిక్కబొడుస్తూ కనిపించాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి.
Updated on: Jan 12, 2022 | 12:36 PM

Goosebumps Reasons: వెంట్రుకలు నిక్కబొడవడం.. దీని గురించి అందరికీ తెలిసి ఉండాలి. మీకు చాలా సందర్భాలలో ఇలా కచ్చితంగా జరిగే ఉంటుంది. ఉదాహరణకు వింటర్ సీజన్‌లో హఠాత్తుగా చలి పెరిగినప్పుడు శరీరం వణుకుతుంది. అప్పుడు మన వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. అదేవిధంగా మీరు భయపడినప్పుడు కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. దీంతోపాటు భావోద్వేగానికి గురైనప్పుడు, సంతోషానికి గురైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. సంతోషపరిచే విషయాలను వినడం.. పట్టలేని ఆనందానికి గురికావడం, దుఃఖం, భయం, ఉద్వేగం.. వంటి పరిస్థితులలో ఇలా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దాని వెనుక అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దీనిని వైద్య పరిభాషలో.. జట్టు నిక్కబొడవడాన్ని పైలోరెక్షన్, క్యూటిస్ అన్సెరినా లేదా హారిపిలేషన్ అంటారు. వాడుకలో దీనిని గూస్‌బంప్స్ అని పిలుస్తాము. ఈ ప్రక్రియలో మన చర్మంపై ఉండే వెంట్రుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. జుట్టు లేకపోతే చర్మం కాస్త ఉబ్బి పైకి కనిపిస్తుంది. కొన్నిసార్లు శారీరక శ్రమ లేదా మలవిసర్జన వంటి రోజువారీ కార్యకలాపాల సమయంలో కూడా ఇలా జరుగుతుంది.

వెంట్రుకలు నిక్కబొడవడానికి ఒక కారణం ఏమిటంటే.. శారీరక శ్రమ, సానుభూతి, ఉద్వేగం లాంటివి నాడీ వ్యవస్థను సక్రియం చేస్తాయి. కొన్నిసార్లు గూస్‌బంప్స్ ఎటువంటి కారణం లేకుండా వస్తాయి. ఇది వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీకు చాలా చల్లగా అనిపించినప్పుడు.. కండరాల కదలిక వెంట్రుకలు నిక్కబొడవడానికి సక్రియం చేస్తుంది. ఈ సందర్భంలో శరీరం వేడిగా మారుతుంది. మీ శరీరం వేడెక్కడం ప్రారంభించినప్పుడు మీ జుట్టు క్రమంగా సాధారణ స్థితికి చేరుతుంది.

కొన్నిసార్లు.. ఏదైనా భావోద్వేగం లాంటి సమయంలో వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. మీరు పైన నేహా కక్కర్ చిత్రాన్ని చూశారు కదా.. ఆమె భావోద్వేగానికి లోనైనప్పుడు అలా జరిగింది. ఇండియన్ ఐడల్ షోకు న్యాయనిర్ణేతగా ఉన్నప్పుడు.. ఒక కంటెస్టెంట్ తాను పాడిన పాటను పాడాడు. అద్భుతంగా పాడటంతో ఆమె భావోద్వేగాని గురైనప్పుడు వెంట్రుకలు నిక్కబొడిచాయి.

వాస్తవానికి మీరు తీవ్రమైన భావోద్వేగాలను అనుభవించినప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక చలనచిత్రంలోని సన్నివేశం లేదా చాలా అందమైన పాట, అద్భుతమైన ప్రదర్శనల్లో సామాజిక ఉద్దీపనలతో కూడిన సన్నివేశాలుంటే.. వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబొడుస్తాయి. దానిలో మనం అంతర్లీనం అవుతామని.. దీంతో భావోద్వేగానికి గురై ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వినడం, చూడటం, వాసన, రుచి, స్పర్శ... పైన పేర్కొన్న తీవ్రమైన భావోద్వేగాలకు వారు ప్రతిస్పందించే విధంగా అనుభూతి చెందుతారు. గూస్‌బంప్‌లను ప్రేరేపించే రెండు సాధారణ శరీర ప్రతిచర్యలలో చర్మం కింద కండరాలలో కార్యకలాపాలు పెరగడం, శ్వాస ఎక్కువగా తీసుకోవడం, లేదా శరీరం బరువుగా అనించడం వంటివి ఉన్నాయి. ఈ ప్రతిచర్యల వల్ల మీకు చెమట పట్టవచ్చు లేదా మీ హృదయ స్పందన రేటు పెరగవచ్చు





























