- Telugu News Photo Gallery Friendship Day 2023: visit Indian tourist spots You Must Explore With Your Buddies
Friendship Day: ఫ్రెండ్‌షిప్ డే వేడుకను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటున్నారా.. స్నేహితులతో సందర్శించడానికి ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక
స్నేహం చందనం చెక్కవంటిది.. ఎంత అరగదీసినా దాని సువాసన తగ్గనట్లే.. స్నేహం కూడా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వీడిపోదు అని అంటారు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డే ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఏడాది ఫ్రెండ్ షిప్ డే ఆగస్టు 6వ తేదీన జరుపుకోనున్నారు. మీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్‌షిప్ డేని ఎంజాయ్ చేయడానికి భారతదేశంలోని కొన్ని టూరిస్ట్ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక.
Updated on: Jul 27, 2023 | 9:21 PM

అండమాన్, నికోబార్ దీవులు: మీ స్నేహితులతో అండమాన్, నికోబార్ దీవులను సందర్శించడానికి ఒక వారం సెలవు తీసుకోవచ్చు. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంతం సహజమైన అందంతో అలరిస్తుంది.

గోవా ఉత్తమమైనది : పర్యాటక ప్రాంతాల్లో గోవా వెరీ వెరీ స్పెషల్ప్ర. యువత వినోదం కోసం గోవాను గమ్యస్థానంగా చేసుకుంటారు. గోవా బీచ్‌లో స్నేహితులతో సరదాగా గడపడానికి.. క్యాంప్ ఫైర్, పార్టీ లేదా రాత్రి విహారయాత్రకు గొప్ప ప్రదేశం. స్నేహితులతో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశం.

నైనిటాల్ : దేశ రాజధాని దగ్గరలోని నైనిటాల్ పేరు కూడా మంచి పర్యాటక ప్రాంతం. ఈ ప్రదేశాల సందర్శన తక్కువ ఖర్చుతోనే చేయవచ్చు. ఢిల్లీలోని కశ్మీర్ గేట్ నుండి కేవలం రూ.900కే బస్ టికెట్ లభిస్తుంది. హోటల్ లో కూడా బస చేయడానికి తక్కువ ధర తో అందుబాటులో అంటే 1000 రూపాయలకు గది అందుబాటులో ఉంటుంది.

రణథంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్ : రాజస్థాన్‌లోని రణతంబోర్ సందర్శించడానికి గొప్ప ప్రదేశం. వర్షాకాలంలో ఈ పర్యాటక ప్రదేశం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

రిషికేశ్ : ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయిన రిషికేశ్‌లో ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకోవచ్చు. ప్రకృతి అందాలతో కనులు విందు చేసే ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అన్ని రకాల పర్యటనల కోసం ఇక్కడకు వెళ్లవచ్చు.