- Telugu News Photo Gallery Follow these tips to get rid of Constipation Problem, check here is details in Telugu
Constipation Relief: మలబద్ధకం సమస్య వేధిస్తుందా.. ఇలా రిలీఫ్‌నెస్ పొందండి!
మలబద్ధకం సమస్య అనేది చాలా మంది లైట్‌గా తీసుకుంటారు. కానీ దీంతో చాలా మంది బాధ పడుతున్నారు. ఈ మల బద్ధకం సమస్య వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి బయట పడాలని నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం సమస్యతో సతమతమయ్యేవారు ఈ నేచురల్ టిప్స్‌ను ఫాలో అయితే ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. మల బద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజూ వీలైనంత వరకూ..
Updated on: Feb 09, 2024 | 5:36 PM

మలబద్ధకం సమస్య అనేది చాలా మంది లైట్‌గా తీసుకుంటారు. కానీ దీంతో చాలా మంది బాధ పడుతున్నారు. ఈ మల బద్ధకం సమస్య వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి బయట పడాలని నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం సమస్యతో సతమతమయ్యేవారు ఈ నేచురల్ టిప్స్‌ను ఫాలో అయితే ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు.

మల బద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజూ వీలైనంత వరకూ ఎక్కువగా నీటిని తాగండి. ప్రతి రోజూ 15 గ్లాసుల నీటని తాగేలా ప్లాన్ చేయండి. ఉదయం పరగడుపునే నానబెట్టిన ఖర్జూరం తినండి. బొప్పాయి తినడం వల్ల కూడా కడుపులోని పేగుల కదలికలు మెరుగు పడతాయి.

అజీర్ తీసుకోవడం వ్లల కూడా మంచి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న పండ్లు, కూరగాలు తీసుకోవాలి. వాము అన్నం, మిరియాల రసం తినడం వల్ల మంచి మంచి ఫలితం ఉంటుంది.

మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్‌కి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కూడా పేగల కదలికలు వేగవంతం అవుతాయి. పాలు తాగడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.

సబ్జా గింజలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు కూడా హెల్ప్ చేస్తాయి. ఓట్స్‌లో బీటా - గ్లూకాన్స్ ఉంటాయి. ఇది ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది.




