గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు పొడిని కలిపి తాగాలి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి టాన్సిల్ నొప్పి, ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తాయి. పసుపు కలిపిన పాలు తాగితే జలుబు, దగ్గు కూడా దూరమవుతాయి. టాన్సిల్ సమస్యతో బాధపడుతుంటే వెజిటేబుల్ లేదా చికెన్ సూప్ వేడివేడిగా తాగితే మెడకు విశ్రాంతినిస్తుంది. అలాగే జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. టాన్సిల్ నొప్పి కూడా తగ్గుతుంది.