- Telugu News Photo Gallery Cinema photos Sobhita Dhulipala flaunts her engagement ring for the first time ina stunning in a saree, Naga Chaitanya reacts
Sobhita Dhulipala: చీరకట్టులో శోభిత ధూళిపాళ్ల.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపిస్తూ హొయలు.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, అందాల తార శోభితా ధూళపాళ్ల మరి కొన్ని నెలల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. ఆగస్ట్ 8న ఈ ప్రేమ పక్షుల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు చైతన్య, శోభిత.
Updated on: Sep 05, 2024 | 9:38 PM

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, అందాల తార శోభితా ధూళపాళ్ల మరి కొన్ని నెలల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. ఆగస్ట్ 8న ఈ ప్రేమ పక్షుల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు చైతన్య, శోభిత.

కాగా నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం సడెన్ గా జరిగినప్పటికీ పెళ్లి విషయంలో తొందర ఉండదని ఇప్పటికే అక్కినేని నాగార్జున ప్రకటించారు.

వచ్చే ఏడాది మార్చిలో విదేశాల్లోనే అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం జరుగుతోంది.

నిశ్చితార్థం తర్వాత మళ్లీ ఎవరి వ్యక్తిగత పనుల్లో వారు బిజీగా మారిపోయారు నాగ చైతన్య, శోభిత. తాము అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారీ లవ్ బర్డ్స్.

ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. అయితే తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో దర్శనం ఇచ్చిందీ అందాల తార. అందమైన చీరకట్టులో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఈ సందర్భంగా నిశ్చితార్థం ఉంగరం చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది శోభిత. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాబోయే భర్త నాగ చైతన్య కూడా శోభిత ఫొటోలకు మురిసిపోయి లైక్ కొట్టాడు.