- Telugu News Photo Gallery Diabetes Care: Eating Cucumber Regularly May Help Reduce Blood Sugar Levels
మందులక్కర్లేదు.. డైట్ అవసరమే లేదు.. డయాబెటిస్‌కు అద్భుతమైన ఛూమంత్రం..!
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మధుమేహం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. ప్రమాదకరమైన డయాబెటిస్ వ్యాధికి సరైన మందంటూ ఏదీ లేదు.. కొన్ని అందుబాటులో ఉన్నా అవి షుగర్ నియంత్రణ కోసం మాత్రమే.. అందుకే.. షుగర్ ను కంట్రోల్ ఉంచుకునేలా జీవనశైలిని, తినే ఆహారంలో మార్పులు చేసుకోవడమే..
Updated on: Oct 10, 2024 | 1:12 PM

సాధారణంగా బరువు పెరగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే కీరదోస తినడం స్థూలకాయాన్ని నివారిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. శరీరంలో స్థూలకాయం పెరిగితే మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కీరదోస ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

దోసకాయలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతమైన అనేక పదార్థాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలి. ఇంకా, బరువు పెరగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడకుండా ఉండే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకు దోసకాయ తింటే స్థూలకాయం నివారిస్తుంది.

కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీరదోసకాయలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసి కడుపు సమస్యలను నివారిస్తుంది.

Cucumber

దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సమస్యలు దరిచేరవు. అందుకే కీర దోసను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి)




