చర్మం మృదువుగా ఉండాలంటే యాలకులతో ఫేస్ స్క్రబ్ ఎంతో మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఒక స్పూన్ యాలకల పొడి, ఒక స్పూన్ తేనె, టీ స్పూన్ చక్కెర తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖం, మెడ భాగాల్లో రాసుకొని స్మూత్‌గా మర్దనా చేసుకోవాలి. పది నిమిషాలు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా మీ ఫేస్‌లో మంచి గ్లో కనిపిస్తుంది.