IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంలో కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్రాంఛైజీలు.. షాక్ అవుతున్న ప్రేక్షకులు
IPL వేలం మొదటి సెట్లో మోర్కీ ప్లేయర్ల కోసం వేలంపాటలు జరిగాయి. ఈ సెట్లో మొత్తం ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆరుగురు ఆటగాళ్ల కోసం 110 కోట్లు వేలం వేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషబ్ పంత్‌కు అత్యధిక ధర పలికింది.
Ipl 2025
Follow us
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరుగుతోంది. అందరి దృష్టి ఈ తొలి సెట్‌పైనే పడింది. ఇందులో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, కగిసో రబడ ఉన్నారు.
ఐపీఎల్ బిడ్ అర్ష్‌దీప్ సింగ్‌తో ప్రారంభమైంది. అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ అతడిని ఆర్టీఎం కార్డు వినియోగించి
రూ.18 కోట్లకు ఉంచుకుంది.
ఐపీఎల్ బిడ్ అర్ష్‌దీప్ సింగ్‌తో ప్రారంభమైంది. అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ అతడిని ఆర్టీఎం కార్డు వినియోగించి
రూ.18 కోట్లకు ఉంచుకుంది.
ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్లో టైటిల్ గెలుచుకుంది. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలని పంజాబ్, ఢిల్లీలో టగ్ ఆఫ్ వార్ నడిచింది. కానీ పంజాబ్ జట్టు 26.75 కోట్లకు తీసుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన మిచెల్ స్టార్క్‌కు వేలంలో ఎంత ధర వస్తుందనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. 2023 మినీ వేలంలో మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు పలికాడు. కానీ ఈసారి రూ.11.75 కోట్లకు ఢిల్లీ తీసుకుంది. కోల్‌కతా RTM కార్డును కూడా ఉపయోగించలేదు.
జోస్ బట్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది. ఎందుకంటే ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసిన తర్వాత వారికి వేరే మార్గం లేదు. కాబట్టి అతనికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడం కష్టం. చివరకు గుజరాత్ టైటాన్స్ 15.75 కోట్లు వెచ్చించి అతడిని తమ జట్టులోకి తీసుకుంది.
మోర్కీ ప్లేయర్ల మొదటి సెట్లో కనిపించిన చివరి పేరు రిషబ్ పంత్. రిషబ్ పంత్ కోసం ఢిల్లీ కూడా RTM కార్డును ఉపయోగించింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ చేసిన 27 కోట్ల బిడ్ చూసి, వారు కూడా ఒక అడుగు వెనక్కి వేశారు.