Ind vs Aus: రఫ్ఫాడించిన టీమిండియా ఓపెనర్లు.. వాళ్ల జోడిని గుర్తు చేసిన యంగ్ ప్లేయర్లు..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. అలాగే లెజెండ్ సునీల్ గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.

Velpula Bharath Rao

|

Updated on: Nov 24, 2024 | 10:13 AM

.పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ధీటుగా బ్యాటింగ్ కొనసాగించింది. భారత జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఈ అద్భుతమైన బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు.

1 / 5
ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాలో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనింగ్ జోడీగా రికార్డులకెక్కింది.

2 / 5
అంతకుముందు, సునీల్ గవాస్కర్, క్రిస్ శ్రీకాంత్‌లు ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించారు. 1986లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ జోడీ తొలి వికెట్‌కు 191 పరుగులు జోడించి చరిత్ర సృష్టించింది.

3 / 5
38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ విజయం సాధించారు. దీంతో ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఓపెనింగ్ జోడీగా రికార్డులకెక్కారు.

4 / 5
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటైంది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (77) వికెట్ కోల్పోయి 202 పరుగులు (64 ఓవర్లు) సాధించింది.

5 / 5
Follow us