- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 Points Table: Kolkata Knight Riders races to top of the table, Delhi Capitals fall to 9th
IPL 2024: చక్రం తిప్పేసిన గంభీర్.. దెబ్బకు టాప్‌లేపిన కేకేఆర్.. కోహ్లీ టీం ఎక్కడుందంటే.?
ఐపీఎల్ 17వ ఎడిషన్ మాంచి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో 16 మ్యాచ్‌లు పూర్తి కాగా.. పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. టాప్ లేపుతాయ్ అనుకున్న జట్లు చతికిలపడ్డాయి. అండర్ డాగ్స్‌గా దిగిన జట్లు దుమ్మురేపుతున్నాయి. మరి ఆ జట్ల స్థానాల లిస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Apr 04, 2024 | 9:26 AM

ఐపీఎల్ 17వ ఎడిషన్ మాంచి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో 16 మ్యాచ్‌లు పూర్తి కాగా.. పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. టాప్ లేపుతాయ్ అనుకున్న జట్లు చతికిలపడ్డాయి. అండర్ డాగ్స్‌గా దిగిన జట్లు దుమ్మురేపుతున్నాయి. మరి ఏ జట్టు ఏయే స్థానంలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ ఐపీఎల్‌లో తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. వెరిసి +2.518 నెట్ రన్‌రేట్‌తో 6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచింది. +1.249 నెట్ రన్‌రేట్‌తో మొత్తం 6 పాయింట్లే సాధించి రెండో స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 1 ఓటమితో మూడో స్థానంలో ఉంది. మొత్తం 4 పాయింట్లతో CSK ప్రస్తుత రన్ రేట్ +0.976గా ఉంది.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ 4వ స్థానంలో ఉంది. LSG ఆడిన 3 మ్యాచ్‌లలో 2 గెలిచింది. మొత్తం 4 పాయింట్లతో +0.483 రన్ రేట్ సాధించింది.

ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్.. 4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ -0.738గా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి 2 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. SRH జట్టు రన్ రేట్ +0.204.

పంజాబ్ కింగ్స్ జట్టు 3 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.337.

RCB ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయి 8వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. నెట్ రన్ రేట్ -0.876గా ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌లలో ఒక విజయాన్ని సాధించింది. నెట్ రన్ రేట్ -1.347తో 2 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -1.423.




