- Telugu News Photo Gallery Cricket photos Ind vs nz Shubman gill key statement on rohit sharma retirement champions trophy 2025 final
IND vs NZ: ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడా? శుభ్‌మాన్ గిల్ కీలక ప్రకటన
Shubman Gill Key Statement on Rohit Sharma Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముందు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడా, లేదా? ఈ విషయంపై శుభ్‌మాన్ గిల్ కీలక ప్రకటన చేశాడు. విలేకర్ల సమావేశంలో అసలు శుభ్‌మాన్ గిల్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 08, 2025 | 9:08 PM

Shubman Gill Key Statement on Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్ అవుతాడా లేదా? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అవుతుందా? ఈ ప్రశ్నలు ప్రతి క్రికెట్ అభిమాని మదిలో నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నకు జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ రిటైర్ అవుతారా అని దుబాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శుభ్‌మాన్ గిల్‌ను అడిగారు. ఈ ప్రశ్నకు గిల్ ఏమన్నాడంతో ఓసారి చూద్దాం.. రోహిత్ రిటైర్మెంట్ గురించి డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి చర్చ జరగలేదని శుభ్‌మాన్ గిల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ దాని గురించి ఆలోచిస్తాడని తాను అనుకోనని గిల్ తెలిపాడు.

శుభ్‌మాన్ గిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 'ఫైనల్‌కు ముందు మ్యాచ్ గెలవడం గురించి చర్చ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీని ఎలా గెలుచుకోవాలనే దానిపై చర్చ జరిగింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి జట్టుతో లేదా నాతో ఎటువంటి చర్చ జరగలేదు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడని నేను కూడా అనుకోను. మ్యాచ్ ముగిసిన తర్వాతే అతను తన నిర్ణయం తీసుకుంటాడు. ప్రస్తుతానికి ఎటువంటి చర్చ జరగలేదు అని తెలిపాడు.

రోహిత్ శర్మకు త్వరలో 38 ఏళ్లు నిండనున్నాయి. అతను ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 2027 లో భారతదేశం తదుపరి పెద్ద ఐసీసీ టోర్నమెంట్ ఆడాలి. ఆ సమయంలో రోహిత్ వయస్సు దాదాపు 40 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి, అలాంటి పరిస్థితిలో రోహిత్ మరింత ఆడటం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారో శుభమన్ గిల్ విలేకరుల సమావేశంలో తెలిపాడు. ఫైనల్‌లో ఒత్తిడిని చక్కగా నిర్వహించే జట్టు గెలుస్తుందని గిల్ అన్నాడు. ప్రస్తుత భారత జట్టు అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉందని గిల్ అన్నారు. గతంలో బ్యాటింగ్ లైనప్ చిన్నగా ఉండటం వల్ల ఒత్తిడి ఉండేది. కానీ, ఇప్పుడు రోహిత్, విరాట్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా జట్టులో ఉన్నారు.

ముందుగా బ్యాటింగ్ చేయడానికి, తరువాత బ్యాటింగ్ చేయడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని శుభ్‌మాన్ గిల్ అన్నాడు. 'మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం' అని గిల్ అన్నాడు. మనం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ముందు లేదా తర్వాత చేయాల్సి వచ్చినా చేస్తాం. బౌలర్లు కూడా ఇలాగే సిద్ధమవుతారు. ఫైనల్ మ్యాచ్‌లో నాకు నేను మరికొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.




