- Telugu News Photo Gallery Cricket photos Australia vs England 2021: Australia Star Batsman Steve Smith's average falls below 60 after poor batting performance in Ashes 2021 22
11 ఏళ్ల తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పడిపోయిన సగటు.. సెంచరీ లేకుండానే సిరీస్ ముగించిన ప్లేయర్ ఎవరంటే?
Ashes 2021: ఆస్ట్రేలియా దిగ్గజం స్మిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌ను 61.8 అద్భుతమైన టెస్ట్ సగటుతో ప్రారంభించాడు. అయితే 5 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత అది దారుణంగా పడిపోయింది.
Updated on: Jan 16, 2022 | 3:29 PM

Australia vs England 2021: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ బ్యాట్ మూగబోయింది. అతను సిరీస్ ప్రారంభానికి ముందు జట్టుకు వైస్-కెప్టెన్ అయ్యాడు. అడిలైడ్ టెస్ట్‌లో మూడున్నరేళ్ల తర్వాత కెప్టెన్సీ అవకాశాన్ని పొందాడు. కానీ, బ్యాట్ మొత్తం సిరీస్‌కు మద్దతు ఇవ్వలేదు. యాషెస్‌లో 11 సంవత్సరాల తర్వాత స్మిత్ రాణించకపోవడం గమనార్హం. అలాగే సగటు కూడా దారుణంగా పడిపోయింది.

హోబర్ట్ టెస్టులో స్టీవ్ స్మిత్ సిరీస్ చివరి ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 11 ఏళ్ల తర్వాత యాషెస్‌లో సెంచరీ చేయలేకపోవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2010-11 యాషెస్‌లో, స్మిత్ 3 టెస్టులు ఆడాడు. అయితే అతను 6, 7 నంబర్లలో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత 4 యాషెస్ సిరీస్‌లో 11 సెంచరీలు చేశాడు.

ఈ సిరీస్‌లో, స్మిత్ బ్యాట్ 8 ఇన్నింగ్స్‌లలో 244 పరుగులు మాత్రమే చేసింది. సగటు 30.50గా నిలిచింది. స్మిత్ కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. ఇందులో అత్యుత్తమ స్కోరు 93 పరుగులు. ఒక ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు.

యాషెస్ 2021 ప్రారంభానికి ముందు 77 టెస్టుల్లో స్మిత్ సగటు 61.8గా ఉంది. అయితే సిరీస్‌లోని 5 టెస్ట్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి అది గణనీయంగా క్షీణించి ప్రస్తుతం 59.87కి పడిపోయింది.




