- Telugu News Photo Gallery Cricket photos Indian Cricket Team: Team India Player Virat Kohli Resigns From Test Captaincy: Former India Captain broke multiple records in batting
Virat Kohli Resigns: కెప్టెన్సీలో రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ.. 7 ఏళ్లలో ఎలాంటి ఘనతలు సాధించాడంటే?
డిసెంబర్ 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లి తొలిసారిగా భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్తీ మొదటి రికార్డు కూడా ఇక్కడే ప్రారంభమైంది.
Updated on: Jan 16, 2022 | 4:31 PM

Virat Kohli Resigns: దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ టెస్టులో ఓటమితో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పదవీకాలం కూడా ముగిసింది. జనవరి 15న శనివారం టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ తన చివరి మ్యాచ్‌లో 79, 29 పరుగులు చేసినా 7 ఏళ్ల పాటు కొనసాగిన కెప్టెన్సీలో కోహ్లీ బ్యాట్ రెట్టింపు బలంతో పరుగులు చేసి ఎన్నో రికార్డులు సృష్టించాడు.

2014 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి సెంచరీలు సాధించాడు. క్రికెట్ చరిత్రలో, ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ తర్వాత కెప్టెన్సీ అరంగేట్రం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

కోహ్లీ కెప్టెన్‌గా 68 టెస్టు మ్యాచ్‌ల్లో 20 సెంచరీలు చేశాడు. ఈ విధంగా, అతను కెప్టెన్సీలో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (25) తర్వాత ప్రపంచంలోని రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ 68 టెస్టు మ్యాచ్‌ల్లో 113 ఇన్నింగ్స్‌లలో కోహ్లి బ్యాట్ మొత్తం 5864 పరుగులు చేసింది. ఇందులో అతని సగటు 54.80గా నిలిచింది. భారత కెప్టెన్లలో ఇదే అత్యధికం. గ్రేమ్ స్మిత్ (8659), అలన్ బోర్డర్ (6623), రికీ పాంటింగ్ (6542) మాత్రమే అతని కంటే ఎక్కువ పరుగులు చేశారు.

టెస్టు క్రికెట్‌లో కోహ్లి 7 డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఏడు డబుల్ సెంచరీలు అతని కెప్టెన్సీలోనే వచ్చాయి. ఈ విధంగా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ రికార్డు కూడా అతని పేరిటే ఉంది.

ఇది కాకుండా, 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన పూణె టెస్టులో కోహ్లీ 254 పరుగుల (నాటౌట్) ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో భారత కెప్టెన్లందరికీ ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్. విశేషమేమిటంటే కోహ్లీ శ్రీలంకపై 243, ఇంగ్లండ్‌పై 235 అద్భుత ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. ఇది మాత్రమే కాదు, నార్త్ సౌండ్‌లో వెస్టిండీస్‌పై 200 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఓవర్సీస్ టెస్టుల్లో ఏ భారత కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరైనా ఇదే కావడం విశేషం.

మొత్తంగా, కోహ్లీ కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో 41 సెంచరీలు సాధించాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ను సమం చేశాడు. గత రెండేళ్లలో ఏ సెంచరీ కూడా రాకపోవడంతో, ఈ రికార్డును తన పేరిటే చేసుకునే అవకాశాన్ని కోహ్లీ కోల్పోయాడు.




