- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli's Wife Anushka Sharma share emotional Post as Kohli resigns from Indian Cricket Team Test Captaincy
Virat Kohli Resigns: ఆ సమయంలో నీ కళ్లల్లో నీళ్లు చూశాను: విరాట్ రాజీనామాపై అనుష్క ఉద్వేగం
Anushka Sharma: విరాట్ కోహ్లీ 7 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలం తర్వాత జనవరి 15 శనివారం టెస్టు జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
Updated on: Jan 16, 2022 | 5:33 PM

భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి రాజీనామా చేసినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ షాక్ అవుతూ.. వారిదైన రీతిలో మాజీ కెప్టెన్‌ను విష్ చేస్తున్నారు. బీసీసీఐ, అభిమానులు, సహచరుల తర్వాత ప్రస్తుతం కోహ్లి భార్య, సినీ నటి అనుష్క శర్మ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ రాసి కోహ్లీ సహకారాన్ని మెచ్చుకున్నారు. అనుష్క భావోద్వేగ పోస్ట్ నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.

'2014లో ఎంఎస్ ధోని (MS Dhoni) టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి, నిన్ను కెప్టెన్‌గా నియమించారని మీరు చెప్పిన రోజు నాకు గుర్తుంది. ఆ రోజు ఎంఎస్, మీరు, నేను మాట్లాడుకోవడం నాకు గుర్తుంది. త్వరలో మీ గడ్డం తెల్లబడటం ప్రారంభిస్తుంది అని అతను (Dhoni) సరదాగా చెప్పారు. దీంతో మేమంతా చాలా నవ్వుకున్నాం' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

'భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మీరు సాధించిన అభివృద్ధి, మీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాల పట్ల నేను గర్విస్తున్నాను. కానీ, మీరు నాలో సాధించిన ప్రగతికి నేను మరింత గర్వపడుతున్నాను' అని చెప్పుకొచ్చారు.

'నువ్వే ఉదాహరణగా నడిపించి, గెలవడానికి నీ శక్తినంతా పెట్టావు. ఓడిపోయినప్పుడు, నీతో కూర్చున్నప్పుడు నీ కళ్లలో నీళ్ళు చూశాను. ఇంకా నువ్వు చేయగలిగిందేమైనా ఉందా అని ఆలోచిస్తున్నావు. మీరు ఇలాగే ఉంటారు. అందరి నుంచి అదే ఆశించండి' అంటూ స్ఫూర్తినిచ్చారు.

'మీరు పరిపూర్ణులు కాదు. మీలో లోపాలు కూడా ఉన్నాయి. అయితే మీరు వాటిని ఎప్పుడు దాచడానికి ప్రయత్నించలేదు. మీరు ఎల్లప్పుడూ సరైన, కష్టమైన విషయాల కోసం నిలబడతారు. మీరు ఈ పదవి (కెప్టెన్సీ) కోసం కూడా ఎప్పుడూ దేనిపైనా అత్యాశ పడలేదు. అది నాకు తెలుసు' అంటూ పేర్కొంది.




