- Telugu News Photo Gallery Cricket photos Virat kohli left 4 teams captainship in 4 months Indian cricket team Royal challengers Bangalore
Virat Kohli: 4 నెలలు.. 4 జట్లు.. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ..!
Virat Kohli Resigns: విరాట్ కోహ్లీ 2014 నుంచి టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, అతని కెప్టెన్సీ ప్రయాణం నేటితో ముగిసింది.
Updated on: Jan 15, 2022 | 10:19 PM

భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ శనివారం తప్పుకున్నాడు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాతే కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతను ఏ ఫార్మాట్‌లోనూ టీమిండియాకు కెప్టెన్‌గా లేడు. కేవలం మూడు నెలల్లోనే మూడు జట్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.

కోహ్లి 2013 నుంచి IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, IPL-2021 మధ్య సీజన్‌లో, అతను ఈ జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని కెప్టెన్సీలో RCBకి ఒక్క టైటిల్ కూడా అందుకోలేకపోయింది. అక్టోబర్ 11న కోహ్లి RCB కెప్టెన్‌గా తన చివరి మ్యాచ్ ఆడాడు.

అక్టోబరు-నవంబర్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ముందే చెప్పాడు. తన కెప్టెన్సీలో జట్టుకు ప్రపంచకప్ అందించాలనేది అతని ప్రయత్నంగా చెప్పుకొచ్చాడు. కానీ, అందులో విజయం సాధించలేదు. జట్టు సెమీ-ఫైనల్‌కు కూడా వెళ్లలేకపోయింది. నవంబర్‌లో, కోహ్లి టీ20 జట్టు కెప్టెన్‌గా తన చివరి మ్యాచ్ ఆడాడు. రెండు నెలల్లో వరుసగా రెండో జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

kohli

2022 సంవత్సరం వచ్చింది. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్టు కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. కానీ, అతని కెప్టెన్సీలో ఈ సిరీస్‌ను భారత్‌కు అందివ్వలేకపోయాడు. శనివారం, కోహ్లీ టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అంటే, వరుసగా నాలుగో నెల, నాల్గవ జట్టు కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్నాడు.




