Perfume Mistakes: మెచ్చిన పర్‌ఫ్యూమ్.. ఇలా వాడితే తంటాలే! కాస్త చూస్కోండి..
చాలా మందికి పెర్ఫ్యూమ్ వేసుకోనిదే అలంకరణ పూర్తి కాదు. మార్కెట్లో వివిధ బ్రాండ్లు ఉన్నా ఒక్కొక్కరు ఒక్కో బ్రాడ్ పెర్ఫ్యూమ్ ఇష్టపడుతుంటారు. పెర్ఫ్యూమ్ సువాసన ఆ వ్యక్తికి ప్రత్యేక గుర్తింపుగా మారుతుంది. అయితే చాలా మంది పెర్ఫ్యూమ్ వేసుకునేటప్పుడు తప్పులు చేస్తుంటారు. దీంతో లేనిపోని చిక్కులు..
Updated on: Nov 30, 2025 | 11:37 AM

చాలా మందికి పెర్ఫ్యూమ్ వేసుకోనిదే అలంకరణ పూర్తి కాదు. మార్కెట్లో వివిధ బ్రాండ్లు ఉన్నా ఒక్కొక్కరు ఒక్కో బ్రాడ్ పెర్ఫ్యూమ్ ఇష్టపడుతుంటారు. పెర్ఫ్యూమ్ సువాసన ఆ వ్యక్తికి ప్రత్యేక గుర్తింపుగా మారుతుంది. అయితే చాలా మంది పెర్ఫ్యూమ్ వేసుకునేటప్పుడు తప్పులు చేస్తుంటారు. దీంతో లేనిపోని చిక్కులు కొనితెచ్చుకుంటూ ఉంటారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మందికి పెర్ఫ్యూమ్ వేసుకునే అలవాటు ఉంటుంది. కానీ కొందరు మోతాదుకు మించి ఎక్కువగా పెర్ఫ్యూమ్ వేసుకుంటారు. మృదువైన, తేలికపాటి సువాసన చుట్టుపక్కల ఉండే వారిని మైమరిపిస్తుంది. కానీ నిర్దేశించిన దానికంటే ఎక్కువగా పెర్ఫ్యూమ్ వేసుకోవడం వల్ల చుట్టూ ఉండేవారికి తలనొప్పి వస్తుంది. కాబట్టి పల్స్ పాయింట్ల చొప్పున పెర్ఫ్యూమ్ వేసుకోవాలి.

చాలా మంది బలమైన పరిమళ ద్రవ్యాలు వినియోగిస్తుంటారు. కొన్ని పెర్ఫ్యూమ్‌ల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇలాంటి బలమైన పరిమళ ద్రవ్యాలను ఎక్కువగా వినియోగించకూడదు. బలమైన పరిమళ ద్రవ్యాలు మీ పక్కన ఉండే వారికి చికాకు పెట్టిస్తాయి.

చాలా మంది బహిరంగ ప్రదేశాల్లోనూ పెర్ఫ్యూమ్ వినియోగిస్తుంటారు. కానీ దీన్ని నివారించాలి. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో పెర్ఫ్యూమ్ వేసుకోవడం వల్ల చుట్టూ ఉండే వారికి అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఎక్కువ మందిలేని ప్రదేశానికి వెళ్లి పెర్ఫ్యూమ్ వేసుకోవడం మంచిది.

చాలా మంది పెర్ఫ్యూమ్, డియోడరెంట్ కలిపి ఉపయోగిస్తుంటారు. చెమట వాసనను కప్పిపుచ్చడానికి పెర్ఫ్యూమ్ వాడకూడదు. మీకు ఎక్కువగా చెమట పడుతుంటే, ముందుగా డియోడరెంట్ రాసి, ఆపై తేలికపాటి పెర్ఫ్యూమ్ రాసుకోవడం మంచిది. ఇది పెర్ఫ్యూమ్ సువాసన ఎక్కువసేపు ఉండటానికి, శరీర దుర్వాసనను నివారించడానికి సహాయపడుతుంది.




