Viral News: ఈ భూమ్మీద భయంలేని ఏకైక జంతువు ఇదేనట.. ఎందుకో తెలుసా?
most fearless animal on Earth: భూమ్మీద అత్యంత భయంకరమైన జంతువు ఏదంటే చాలా మంది ఒకప్పుడు మనుగడలో ఉన్న డైనోసర్‌లు, ప్రస్తుతం భూమ్మీద ఉన్న సింహాలు, పులుల గురించి చెప్తారు. అదే భూమ్మీద, ప్రపంచంలో అత్యంత నిర్భయంగా( భయంలేకుండా) ఉండే జంతువు ఏదంటే చాలా మాందికి తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఆ జంతువు గురించి తెలుసుకుందాం.
Updated on: Dec 01, 2025 | 2:58 PM

ప్రపంచంలో, భూమ్మీద అత్యంత భయంలేని జంతువు విషయానికి వస్తే.. దాని పేరు హనీ బ్యాడ్జర్.. ఇది అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత నిర్భయ జంతువుగా పిలువబడుతుంది.

ఇది చూడ్డానికి చాలా చిన్నగా అనిపించినా ఇది సింహాలు, విషపూరిత పాములు వంటి ప్రమాదకరమైన జంతువలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా అదరుగా పోటీ నుంచి వెనక్కి తగ్గుతుంది.

ఈ హనీ బాడ్జర్‌ను శాస్త్రీయంగా మెల్లివోరా కాపెన్సిస్ అని పిలుస్తారు. ఈ చిన్న జీవి ఆఫ్రికా, నైరుతి ఆసియా, భారత ఉపఖండం అంతటా కనిపిస్తుంది. ఇది సింహాలు, విషపూరిత పాములు సహా తనకంటే పరిమాణంలో ఎంతో పెద్దవైన అనేక జంతువులపై దాడి చేయడం లేదా వాటిని తరిమికొట్టడం చేయగలదు. దీని క్రూరమైన వైఖరి, సంసిద్ధత కారణంగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నిలుపుకుంది.

ఈ హనీ బ్యాడ్జర్లు ప్రధానంగా మాంసాహారులు, కీటకాలు, ఎలుకలు, పక్షులు, విష పూర్తిత సరీసృపాల, వేర్లు ,పండ్లు, తేనెటీగ లార్వా, తేనె వరకు అన్నింటి తింటాయి. అందుకే ఈ హనీ బ్యాడ్జర్లును కొన్నిసార్లు రాటెల్స్ అని కూడా పిలుస్తారు.

వాటి శారీరక లక్షణాలే వీటికి బలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి బలిష్టమైన శరీరం, పొట్టి కాళ్ళు, మందపాటి, వదులుగా ఉండే చర్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి పాము కాటు, కుట్టడం నుండి వాటిని రక్షిస్తాయి, అవి పట్టుకున్నప్పుడు కూడా మెలితిప్పడానికి, తిరిగి కొట్టడానికి వీలు కల్పిస్తాయి. అందుకే ఇవి ఇతర జంతవులను ఎదురించడం, తప్పించుకోవడంతో చురుగ్గా ఉంటాయి.




