USA : అమెరికాలో మరో భారత విద్యార్ధి మృతి
కాలిఫోర్నియాలో మిస్సైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతదేహం యూనివర్సిటీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో లభ్యమైంది. బెంగళూరుకు చెందిన సాకేత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ట్రెకింగ్, క్యాంపింగ్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో భారతీయుల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ నెల 9న కాలిఫోర్నియాలో తప్పిపోయిన సాకేత్ అనే విద్యార్థి మృతదేహం యూనివర్సిటీకి కిలోమీటర్ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో లభ్యమైంది. అమెరికా పోలీసులు సాకేత్ మృతదేహంతో పాటు అతని బ్యాక్‌ప్యాక్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సాకేత్, కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సాకేత్ ట్రెకింగ్ లేదా క్యాంపింగ్ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన భారతీయ విద్యార్థుల కుటుంబాలలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

