AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేగకన్ను పడిందంటే డ్రోన్‌ కూలాల్సిందే!

డేగకన్ను పడిందంటే డ్రోన్‌ కూలాల్సిందే!

Samatha J
|

Updated on: Feb 15, 2026 | 3:25 PM

Share

దేశ సరిహద్దులను మన సైనికులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ కాపలాకాస్తున్నా చొరబాట్లు ఆగడం లేదు. డ్రోన్లతో డ్రగ్స్‌, నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలను తరలిస్తున్నారు. వాటికి అడ్డుకట్ట వేసేందుకు గద్దలు, గరుడ పక్షులు, ఫాల్కన్‌లకి ట్రైనింగ్‌ ఇచ్చి మెరికలుగా తీర్చిదిద్దింది భారత సైన్యం. శత్రు డ్రోన్‌లు కనిపించగానే రివ్వున ఎగురుతూ వెళ్లి వాటిని కూల్చేసే ఆ పక్షుల తెగువ, వేగం అపూర్వం! వాటిల్లో కరణ్, అర్జున్‌ అనే రెండు నల్లగద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్‌లని కూల్చి సత్తా చాటాయి.

తలపైన బుల్లి కెమెరాని ధరించి ఇవి దేశసరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి. యుద్ధాల్లో పక్షుల వేట ఇప్పటిమాట కాదు! రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా గద్దల్ని పావురాల్ని వాడాయి. ప్రపంచానికి డ్రోన్‌లు పరిచయమై, అవి తమకి తలనొప్పిగా మారాక కొన్ని దేశాలు మళ్లీ గద్దల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పక్షులు వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది! ఏ పక్షినీ ఇవి నేరుగా వెళ్లి ఢీకొట్టవు. అలా ఢీ కొడితే తమక్కూడా గాయాలవుతాయని వాటికి తెలుసు. అందుకే, పక్కగా వెళుతూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కిందపడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన ‘డేగకన్ను’… ఏ అత్యాధునిక కెమెరాకీ తీసిపోనంత పరిశీలనగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్‌లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి. డ్రోన్‌లో ఇట్టే విరిగిపోయే భాగాలైన రోటర్‌లు, ప్రొపెల్లర్‌లపైన దాడిచేసేలా వీటికి శిక్షణ ఇస్తున్నారు. వీటి కాళ్లకి లెదర్‌ కవచాలూ తొడుగుతున్నారు. రెండు కేజీలకన్నా తక్కువ బరువున్న డ్రోన్‌ను కూల్చడానికి వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్‌లని ఇప్పటికే కూల్చిన ఈ పక్షులకి ఇప్పటిదాకా ఏ ప్రమాదమూ జరగలేదు. ప్రతి పక్షిపైనా శిక్షణ, కోసం ఏటా రూ.5 లక్షల దాకా ఖర్చుచేస్తుంది కేంద్రం.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!