- Telugu News Photo Gallery Coconut Water For Hair: ways to use coconut water for hair growth thickness
Coconut Water For Hair: వర్షాకాలంలో జుట్టుకి కొబ్బరి నీళ్లని అప్లై చేసి చూడండి.. ఆపై మేజిక్ మీరే చూడండి..
కొబ్బరి నీరు ప్రకృతి ఇచ్చిన ఓ వరం.. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. పునరుజ్జీవింపజేస్తుంది. అయితే ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని మీకు తెలుసా? కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ జుట్టుకు పోషణ లభిస్తుంది. పొడిబారడం, జుట్టు చిట్లడం, తల దురద వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఇప్పుడు మీ జుట్టు సంరక్షణ కోసం ఈ అద్భుత నీరుని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.
Updated on: Aug 17, 2023 | 1:07 PM

తలను తేమగా ఉంచేందుకు కొబ్బరి నీరు సహాయపడుతుంది. దీని వల్ల చుండ్రు సమస్య ఉండదు. ఈ కొబ్బరి నీరు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా కొబ్బరి నీరు తాగాలని చెబుతారు. ఇందులో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇది వివిధ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

పొట్ట, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ముఖానికి కొబ్బరి నీరు రాసుకుంటే ముఖంపై నల్ల మచ్చలు ఉండవు. అదే విధంగా ఈ కొబ్బరి నీరు జుట్టుకు అప్లై చేయడం వలన అనేక రకాల జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి. జుట్టు అందంగా నిగనిగలాడుతుంది. ఒక్కసారి వాడితే ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది.

కొబ్బరి నీరులోని పోషకాలు జుట్టు లోతుల్లోకి చేరుతుంది. దీంతో తలలో తేమ ఉండేలా చేస్తుంది. ఫలితంగా జుట్టు సిల్క్ లాగా మృదువుగా ఉంటుంది. అంతేకాదు జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి.

కొబ్బరి వాటర్‌ను తలకు పట్టించడం వల్ల రకరకాల సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. స్కాల్ప్ ఇరిటేషన్, దురద తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్‌లో మంటను తగ్గించడంలో సహాయపడతాయి

వర్షాకాలంలో జుట్టు చిట్లడం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ సీజన్ లో జుట్టుకు క్రమం తప్పకుండా కొబ్బరి నీటిని అప్లై చేస్తే, ఆ సమస్య పరిష్కరించబడుతుంది.




