- Telugu News Photo Gallery Cleaning your gas stove with these is easy Tips, Check here is details in Telugu
Gas Stove Cleaning: వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
వంట ఫాస్ట్‌గా చేయడానికి గ్యాస్ స్టవ్ అనేది చాలా ముఖ్యం. అదే విధంగా గ్యాస్ స్టవ్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తే.. ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కేవలం గ్యాస్ స్టవే కాకుండా బర్నర్లు కూడా చాలా ముఖ్యం. వీటిని క్లీన్ చేస్తే మంట అనేది పెద్దదిగా వస్తుంది. గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయడంలో బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. ముందుగా బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్‌ను నీటిలో..
Updated on: Apr 24, 2024 | 1:32 PM

వంట ఫాస్ట్‌గా చేయడానికి గ్యాస్ స్టవ్ అనేది చాలా ముఖ్యం. అదే విధంగా గ్యాస్ స్టవ్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తే.. ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కేవలం గ్యాస్ స్టవే కాకుండా బర్నర్లు కూడా చాలా ముఖ్యం.

వీటిని క్లీన్ చేస్తే మంట అనేది పెద్దదిగా వస్తుంది. గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయడంలో బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. ముందుగా బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్‌ను నీటిలో కలిపి గ్యాస్ స్టవ్ మీద వేసి ఓ ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే.. శుభ్రపడటమే కాకుండా దుర్వాసన కూడా మాయం అవుతుంది.

నిమ్మకాయ రసం కూడా గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయడంలో చక్కగా పని చేస్తుంది. గ్యాస్ స్టవ్ మీద ఎన్నో వంటలు చేస్తూ ఉంటాం. దీంతో ఆహార పదార్థాలు, ఆయిల్ పడి జిడ్డుగా ఉంటుంది. అలాంటి సమయంలో నిమ్మరసం వేసి.. నిమ్మ తొక్కతో రుద్దితే ఈజీగా మరకలు పోతాయి.

గ్యాస్ స్టవ్‌లో బర్నర్లు చాలా ముఖ్యం. వీటికి పట్టిన మరకలు త్వరగా వదలవు. చాలా జిడ్డుగా ఉంటాయి. వీటిని శుభ్రం చేయడంలో అమ్మోనియా బాగా సహాయ పడుతుంది. వీటిని రాత్రంతా అమ్మోనియా నీటిలో నానబెట్టి.. ఉదయం సాధారణ నీటితో కడిగితే చాలు.

అలాగే ఓ పాత్రలో వేడి నీటిని తీసుకోండి. అందులో బేకింగ్ సోడా, నిమ్మ రసం పిండాలి. ఆ తర్వాత బర్నర్స్ అందులో ఉంచండి. నీరు చల్లారిపోయాక ఒక సారి స్క్రబ్బర్‌తో రుద్దండి. ఇలా చేయడం వల్ల మురికి బాగా వదులుతాయి.




