- Telugu News Photo Gallery Cinema photos Will Tier 2 Heroes get success with latest movies, know the detail
ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న కుర్ర హీరోలు.. ఈ సారైనా వాళ్ళ టైమ్ టర్న్ అయ్యేనా ??
అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నట్లు.. అసలే మన కుర్ర హీరోలు బాగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారనాలేమో..? ముఖ్యంగా 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలంతా రేసులో వెనకబడిపోయారు. హిట్టు కొడితే కానీ.. వాళ్ళ టైమ్ టర్న్ అయ్యేలా లేదు. మరి ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న ఆ కుర్ర హీరోలెవరు..? వాళ్లు చేస్తున్న సినిమాలేంటి..? స్టార్ హీరోలకు వచ్చిన నష్టమేం లేదు.. ఒకట్రెండు ఫ్లాపులొచ్చినా ఒక్క హిట్‌తో మళ్లీ కాలం కలిసొస్తుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు.. ముందు సినిమా ఫ్లాపైతే ఆ ప్రభావం తర్వాతి సినిమాపై పడుతుంది.
Updated on: Dec 06, 2023 | 4:35 PM

అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నట్లు.. అసలే మన కుర్ర హీరోలు బాగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారనాలేమో..? ముఖ్యంగా 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలంతా రేసులో వెనకబడిపోయారు. హిట్టు కొడితే కానీ.. వాళ్ళ టైమ్ టర్న్ అయ్యేలా లేదు. మరి ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న ఆ కుర్ర హీరోలెవరు..? వాళ్లు చేస్తున్న సినిమాలేంటి..?

స్టార్ హీరోలకు వచ్చిన నష్టమేం లేదు.. ఒకట్రెండు ఫ్లాపులొచ్చినా ఒక్క హిట్‌తో మళ్లీ కాలం కలిసొస్తుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు.. ముందు సినిమా ఫ్లాపైతే ఆ ప్రభావం తర్వాతి సినిమాపై పడుతుంది. అందుకే దినదినగండంలా ఉంటుంది వాళ్ల పరిస్థితి. ప్రస్తుతం నితిన్, నిఖిల్ నుంచి మొదలుపెట్టి నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వరకు అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు.

నితిన్‌కు సరైన హిట్ వచ్చి చాలా కాలమైంది. గతేడాది మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టరే. ఈయన ఆశలన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపైనే ఉన్నాయి. డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే నాగ చైతన్య కస్టడీతో డీలా పడినా.. దూత వెబ్ సిరీస్‌తో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం తనకు గతంలో హిట్టిచ్చిన చందూ మొండేటితో తండేల్ సినిమా చేస్తున్నారు.

ఖుషీతో యావరేజ్ దగ్గరే ఆగిపోయారు విజయ్ దేవరకొండ. దాంతో ఫ్యామిలీ స్టార్ ఈయన కెరీర్‌కు కీలకంగా మారింది. అలాగే స్పైతో దారుణంగా బోల్తా కొట్టిన నిఖిల్.. ది ఇండియా హౌజ్, స్వయంభులతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు.

స్కందతో రామ్‌కూ షాక్ తప్పలేదు.. అందుకే డబుల్ ఇస్మార్ట్‌తో భారీ హిట్‌పై కన్నేసారు. శర్వానంద్ సైతం చాన్నాళ్లుగా బ్లాక్‌బస్టర్ బాడీ పడిపోయారు. మరి ఈ మిడిల్ ఆర్డర్ ఎప్పటికి ఫామ్‌లోకి వస్తుందో..?




