- Telugu News Photo Gallery Cinema photos Will the rest of the heroes do the feat that is possible only for Prabhas?
Tollywood Heroes: డార్లింగ్ బాటలోనే అందరు హీరోలు.. అది సాధ్యమయ్యేనా.?
ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి మేం రెడీ అంటూ హీరోలు చాలా మంది స్టేట్‌మెంట్స్ బాగానే ఇస్తున్నారు. కానీ ఇది వాళ్ళు చెప్పినంత ఈజీనా..? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయగలరా..? ప్రభాస్ ఒక్కడికే సాధ్యమవుతున్న ఈ ఫీట్‌ను మిగిలిన వాళ్లు చేసి చూపిస్తారా..? ఆ సాధ్యాసాధ్యాలేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దామా..
Updated on: Feb 08, 2025 | 7:46 AM

ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనంగా మారింది.. ఇంకా చెప్పాలంటే రెండేళ్ళకో సినిమా చేస్తున్నారు మనోళ్లు. ఇలాంటి సమయంలో ఏడాదికి రెండు సినిమాలు అనే కాన్సెప్టే అసాధ్యం. పైగా అందరూ ప్యాన్ ఇండియా హీరోలైపోయే..! బడ్జెట్ బారెడు పెడుతున్నారు అందుకే వర్కింగ్ డేస్ కూడా పెరుగుతున్నాయి.

ప్యాన్ ఇండియన్ హీరోలలో ప్రభాస్ ఒక్కడే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజా సాబ్ విడుదల కానుంది.. అలాగే హను రాఘవపూడి ఫౌజీ కూడా తక్కువ గ్యాప్‌లోనే రానుంది. అంటే ఇవి రెండు ఈ ఏడాది వస్తాయి.

అలాగే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే రెండేళ్లలోనే విడుదల కానున్నాయి. ప్రభాస్ చేసినట్లే తాము కూడా వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్నారు మిగిలిన హీరోలు కూడా.

అందులో రామ్ చరణ్ ముందున్నారు. గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్లు తీసుకున్న ఈయన.. బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. డిసెంబర్‌లోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ లైన్‌లో ఉన్నారు.

ఎన్టీఆర్ సైతం వార్ 2తో ఆగస్ట్ 14న రానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సిద్ధంగా ఉంది. ఇక దేవర 2 కూడా లైన్‌లోనే ఉంది. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు తారక్. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం కనీసం రెండేళ్లు కావాలంటున్నారు. సీనియర్స్‌లో చిరు, బాలయ్య మాత్రం ఏడాదికి రెండు సినిమాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారు.




