- Telugu News Photo Gallery Cinema photos Pushpa 2 The Rule to Chhaava latest Film Updates from movie Industry
Film Updates: రిపీటెడ్‌గా పుష్ప 2 సీన్.. నెలన్నర పట్టిందన్న ఛావా డైరెక్టర్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప2 ది రూల్. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఛావా. లైగర్ సినిమాను తన కుమార్తె అసౌకర్యంగానే అంగీకరించారన్నారు అనన్య పాండే తండ్రి చంకీ పాండే. శోభిత తెలుగు చక్కగా మాట్లాడుతుందన్నారు హీరో నాగచైతన్య. ఇప్పుడున్న సొసైటీలో సహ మానవాళి పట్ల దయ తగ్గిపోతోందన్నారు నటి రష్మిక.
Updated on: Feb 08, 2025 | 7:10 AM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప2 ది రూల్. ఈ సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. తాజాగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ ఫైట్ వీడియో విడుదల చేసింది. థియేటర్లలో విజిల్స్ వేసి చూసిన ఆడియన్స్ ఇప్పుడు నెట్టింట్లో రిపీటెడ్‌గా చూస్తున్నారు.

ఛావా చిత్రంలో శంభాజీ మహరాజ్‌ని బంధించి చిత్రహింసలు పెట్టే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో విక్కీ కౌశల్ తీవ్రంగా గాయపడ్డారు. షూటింగ్‌లో భాగంగా ఆయన చేతులను రాత్రంతా కట్టేయడంతో, తెల్లారేసరికి చేతులు మామూలు స్థితికి రాలేదట. తీవ్రమైన తలనొప్పితోనూ బాధపడ్డారట విక్కీ. దాంతో, దాదాపు నెలన్నరపాటు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు డైరక్టర్ లక్ష్మణ్ ఉటేకర్.

లైగర్ సినిమాను తన కుమార్తె అసౌకర్యంగానే అంగీకరించారన్నారు అనన్య పాండే తండ్రి చంకీ పాండే. ఈ మూవీలో యాక్ట్ చేయడం అనన్యకు అసలు ఇష్టం లేదని, తామే ఒప్పించామని తెలిపారు చంకీ పాండే. ఆ కథలో హీరోయిన్ కేరక్టర్‌కి తాను సెట్ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని అనన్య పలు మార్లు చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

శోభిత తెలుగు చక్కగా మాట్లాడుతుందన్నారు హీరో నాగచైతన్య. భాషాపరంగా తనకు సాయం చేస్తుందన్నారు. తాను ఏదైనా కార్యక్రమంలో మాట్లాడాల్సి వస్తే, ఆమె సాయం తీసుకుంటానని చెప్పారు. ఇద్దరి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఒకే రకంగా ఉంటాయని, ఇద్దరం గౌరవిస్తామని చెప్పారు నాగచైతన్య. ఆయన నటించిన తండేల్ తాజాగా విడుదల అయింది.

ఇప్పుడున్న సొసైటీలో సహ మానవాళి పట్ల దయ తగ్గిపోతోందన్నారు నటి రష్మిక. తాను అందరినీ ఒకేలా చూస్తానని చెప్పారు. అందరూ అలాగే ఉండాలని కోరారు. దయతో ఉండమంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అదే థీమ్‌తో ఉన్న టీషర్టుని ధరించిన ఫొటోను కూడా షేర్ చేశారు. కాలికి గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు నేషనల్ క్రష్.




