చిరంజీవితో హీరో, విజేత, పసివాడి ప్రాణం, ప్రతిబంధ్, మాస్టర్ లాంటి చాలా సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. ఇక ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన చిరంజీవి సినిమాలకు లెక్కే లేదు. అందులో ఇండస్ట్రీ హిట్స్ చాలానే ఉన్నాయి. అలాంటి కాంబో 2005లో వచ్చిన అందరివాడు తర్వాత రిపీట్ కాలేదు. చిరు రీ ఎంట్రీ ఇచ్చాక.. కొణిదెల బ్యానర్‌లోనే వరస సినిమాలు చేసారు.. చేస్తున్నారు కూడా.