- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran Tillu Square Photos now trending in social media
Anupama Parameswaran: లిప్ లాక్స్, రొమాన్స్.. సెగ పుట్టిస్తున్న అనుపమ 2.0
ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. యూత్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. మలయాళంలో ప్రేమమ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగులో సమంత, నితిన్ అఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. కెరీర్‌లో హై పాయింట్‌ను మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. కెరీర్‌లో మంచి హిట్స్ ఉన్నా...
Updated on: Feb 16, 2024 | 12:58 PM

ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. యూత్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. మలయాళంలో ప్రేమమ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగులో సమంత, నితిన్ అఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. కెరీర్‌లో హై పాయింట్‌ను మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. కెరీర్‌లో మంచి హిట్స్ ఉన్నా... స్టార్ లీగ్‌లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు. కానీ అప్ కమింగ్ సినిమాలతో ఆ కోరిక కూడా తీరబోతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు అనుపమా.

రౌడీ బాయ్స్, కార్తికేయ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అనుపమా... ఇప్పుడు మరింత జోష్‌తో దూసుకుపోతున్నారు. కెరీర్ మంచి ఫామ్‌లోకి రావటంతో ఈ సారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచి అభిమానులను అలరిస్తున్నారు.

తాజాగా మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. బ్లాక్ బస్టర్ డీజీ టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఈ కర్లీ హెయిర్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్‌లో టిల్లు క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో.. హీరోయిన్ రాధిక క్యారెక్టర్ కూడా అంతే పాపులార్ అయ్యింది. రాధికగా నేహా శెట్టి పర్ఫామెన్స్‌కు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.

ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమకు ఛాన్స్ రావటంతో అమ్మడి ఖాతాలో మరో హిట్ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లో అనుపమ క్యారెక్టర్ చూసిన ఆడియన్స్ రాధికను మరిపించటం పక్కా అంటున్నారు. ఆల్రెడీ సక్సెస్ వైబ్ స్టార్ట్ అవ్వటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనుపమా పరమేశ్వరన్.




