ఒకవేళ పుష్ప 3 ప్లాన్ చేస్తే గనక కచ్చితంగా వెంటనే చేసేయాలి. ఎందుకంటే ఆ లుక్, గెటప్ కోసమే గంటల తరబడి మేకప్ వేసుకుంటున్నారు బన్నీ. అలాంటప్పుడు మరో సినిమాకు కమిటైతే పుష్ప 3 పూర్తి చేయడం కష్టమే. అందుకే పుష్ప ది రోర్ కూడా ఇప్పుడే చేయాల్సిందే. అదే జరిగితే పుష్ప ది రైజ్, రూల్, రోర్ పేర్లతో బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లోనూ RRR వచ్చినట్లే.