పూరీ జగన్నాథ్ కూడా ప్లాపుల్లోనే ఉన్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టారీయన. ముంబైలోనే ఎక్కువ భాగం షూట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఓ సాంగ్, హీరో ఇంట్రో ఫైట్ తీశారు. ముంబై లోనే మరో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూట్ ఉంటుంది. మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు.