- Telugu News Photo Gallery Cinema photos Ranbir kapoor and sandeep reddy vanga Animal movie getting huge response ,weekend collections Telugu Entertainment Photos
Animal: అర్జున్ రెడ్డితో పోల్చిస్తే అంతగా ఆకట్టుకోలేదు యానిమల్.. మిక్స్డ్ టాక్.!
ఊహించినట్టుగానే యానిమల్ సినిమాకు ఊహకద్దని కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఇదే ఊపు కంటిన్యూ అవుతుందా లేదంటే ఆరంభ శూరత్వంగానే మిగిలిపోతుందా..? అసలు యానిమల్ టార్గెట్ ఎంత.. మూడు రోజుల్లో ఈ సినిమా తీసుకొచ్చింది ఎంత.. ఇంకా ఎంత వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.! యానిమల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పై స్పెషల్ స్టోరీ.. సినిమా స్లోగా ఉంది.. లెన్త్ ఎక్కువగా ఉంది.. సెకండ్ హాఫ్ అంతగా బాగోలేదు.. అర్జున్ రెడ్డితో పోల్చి చూస్తే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అంతగా ఆకట్టుకోలేదు..
Updated on: Dec 05, 2023 | 12:37 PM

ఊహించినట్టుగానే యానిమల్ సినిమాకు ఊహకద్దని కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఇదే ఊపు కంటిన్యూ అవుతుందా లేదంటే ఆరంభ శూరత్వంగానే మిగిలిపోతుందా..? అసలు యానిమల్ టార్గెట్ ఎంత.. మూడు రోజుల్లో ఈ సినిమా తీసుకొచ్చింది ఎంత.. ఇంకా ఎంత వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.!

యానిమల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పై స్పెషల్ స్టోరీ.. సినిమా స్లోగా ఉంది.. లెన్త్ ఎక్కువగా ఉంది.. సెకండ్ హాఫ్ అంతగా బాగోలేదు.. అర్జున్ రెడ్డితో పోల్చి చూస్తే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అంతగా ఆకట్టుకోలేదు.. ఇలా రిలీజ్ రోజు యానిమల్ సినిమాపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి..

కానీ గులుగుడు గులుగుడే.. కలెక్షన్స్ కుమ్ముడు కుమ్ముడే అన్నట్టుంది ఈ సినిమా దూకుడు. 3 రోజుల్లోనే 350 కోట్ల మార్క్ అందుకుంది రణబీర్ కపూర్ లేటెస్ట్ మూవీ. మరోవైపు ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ముందు నుంచి యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ వరకు అన్ని భాషల్లో ఇరగదీసింది ఈ సినిమా. ముఖ్యంగా తెలుగులో అయితే ఏకంగా కేవలం మూడు రోజుల్లోనే 35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడ రవితేజ, నాని లాంటి మీడియం రేంజ్ హీరోల రేంజ్ ఇది.

సందీప్ వంగ టేకింగ్ ఈ ఓపెనింగ్స్ కు ఒక కారణం అయితే.. రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ మరో కారణం. హిందీ పక్కన పెడితే 3 రోజుల్లోనే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది యానిమల్. రణబీర్ గత సినిమా బ్రహ్మాస్త్ర కూడా తెలుగులో మంచి విజయం సాధించింది.

ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నా.. లాంగ్ రన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే యానిమల్ సినిమాకు యూత్ ఫిదా అయిపోయారు.. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి పూర్తిగా దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు.

మరి వాళ్ళ సపోర్టు లేకుండా ఎంత దూరం వెళుతుందనేది ఆసక్తికరమే. కమర్షియల్ గా సేఫ్ అవ్వచ్చు కానీ 500 కోట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకుంటుందా లేదా అనేది ఈ వారం బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ ను బట్టి డిసైడ్ అవుతుంది.




