- Telugu News Photo Gallery Cinema photos Tollywood Hero Natural Star Nani says no to multi starrers and remakes in Film Industry Telugu Heroes Photos
Nani: స్టార్ డైరెక్టర్స్ కు దూరంగా నాని.! మల్టీస్టారర్లకు, రీమేకులకు నో అంటున్న నేచురల్ స్టార్.
నిన్నగాక మొన్న వచ్చిన కుర్ర హీరోలు కూడా అప్పుడప్పుడు టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. కానీ 15 ఏళ్ల కెరీర్.. 30 సినిమాల అనుభవం ఉన్న నాని మాత్రం ఎందుకు అగ్ర దర్శకులకు దూరంగా ఉన్నారు..? ఈయనే వాళ్లను దూరం పెడుతున్నారా లేదంటే నానిని స్టార్ డైరెక్టర్స్ లెక్కచేయడం లేదా..? అసలు గ్యాప్ ఎక్కడ వస్తుంది..?ఎందుకు నాని పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం లేదు.? ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలను వదిలేస్తే మీడియం రేంజ్ హీరోలలో నాని అందరికంటే ముందుంటారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 05, 2023 | 12:37 PM

నిన్నగాక మొన్న వచ్చిన కుర్ర హీరోలు కూడా అప్పుడప్పుడు టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. కానీ 15 ఏళ్ల కెరీర్.. 30 సినిమాల అనుభవం ఉన్న నాని మాత్రం ఎందుకు అగ్ర దర్శకులకు దూరంగా ఉన్నారు..? ఈయనే వాళ్లను దూరం పెడుతున్నారా లేదంటే నానిని స్టార్ డైరెక్టర్స్ లెక్కచేయడం లేదా..? అసలు గ్యాప్ ఎక్కడ వస్తుంది..?

ఎందుకు నాని పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం లేదు.? ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలను వదిలేస్తే మీడియం రేంజ్ హీరోలలో నాని అందరికంటే ముందుంటారు. మార్కెట్ పరంగా కానీ.. విజయాల పరంగా కానీ.. ఎలా తీసుకున్నా కూడా నాని టాప్ లోనే ఉంటారు.

కాకపోతే టాప్ దర్శకులతో మాత్రం పని చేయడంలో మాత్రం అందరికంటే వెనుకుంటారు నాచురల్ స్టార్. కెరీర్ లో రాజమౌళి మినహాయిస్తే ఒక్క అగ్ర దర్శకుడితో కూడా నాని పని చేయలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అది కూడా ఈగలో చిన్న క్యారెక్టర్ మాత్రమే చేశారు నాని.

త్రివిక్రమ్, బోయపాటి, పూరి జగన్నాధ్.. ఇలా ఒక్క అగ్ర దర్శకుడితో కూడా నాని పని చేయలేదు. స్టార్ డైరెక్టర్స్ తో మీరు ఎందుకు పని చేయరని చాలా సార్లు నానిని అభిమానులు కూడా అడిగారు. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నానికి ఈ ప్రశ్న మరోసారి ఎదురైంది.

దీనికి చాలా సింపుల్ సమాధానం చెప్పారు ఈ హీరో. మన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ అందరూ మహేష్, పవన్, చరణ్, బన్నీ, తారక్ అంటూ బిజీగా ఉంటారని.. తన కోసం కొందరు దర్శకులు ఐడియాస్ చెప్పినా కూడా అవి వర్కౌట్ కాలేదని తెలిపారు నాని. నిజంగా కథ నచ్చితే కచ్చితంగా అగ్ర దర్శకులతో పని చేస్తాను అంటున్నారీయన.

తనకు వరసగా సినిమాలు చేయడం ఇష్టమని.. ఎవరో ఒక్క దర్శకుడి కోసం వెయిట్ చేయడం నచ్చదని చెప్పారు నాని. స్టార్ డైరెక్టర్స్ తో సినిమా అంటే వెయిటింగ్ తప్పదని డైరెక్ట్ గానే చెప్పారీయన.

అగ్ర దర్శకులతో పని చేయకపోవడానికి కారణం ఎక్కువ టైమ్ తీసుకోవడమే అనేది నాని మాటల్లో అర్థం అవుతుంది. ఒకవేళ నిజంగా తనకు నచ్చిన కథ ఎవరైనా తీసుకొస్తే దానికోసం వెయిట్ చేస్తాను అంటున్నారు ఈ హీరో. మరి అభిమానులు కోరుకుంటున్నట్టు నానితో సినిమా ఏ అగ్ర దర్శకుడు చేస్తారో చూడాలి.?





























